బాల్య స్నేహితునికి పూర్వ విద్యార్థుల చేయూత
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన ముక్కెర రామచంద్రం పెరాల్సిస్ తో గత రెండు సంవత్సరాలుగా ఆరోగ్యం సహకరించక పోవడంలతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న చిన్న నాటి స్నేహితులు ఆదివారం ముక్కెర రామచంద్రం ఇంటికి వెళ్లి భరోసా కల్పించారు రామచంద్రం కు భార్య ఒక కొడుకు ఒక కుమార్తె ఉన్నారని వారి చిన్ననాటి మిత్రుడు గులాం అహ్మద్ అన్నారు మా మిత్రుడికి అన్ని రకాల అండగా ఉంటామని తక్షణ సహాయంగా 45000 రూపాయలు పిల్లలకు బుక్స్,స్టేషనరీ అందించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో విజయ్,గణేష్,నవీన్,రవీందర్,నరసింహారెడ్డి,నర్సింలు,జగదీష్, చంద్ర రెడ్డి, తదితరులు పాల్గొన్నారు





