*సీఎం కేసీఆర్ కు పెగ్గులు పడితేనే పథకాలు గుర్తొస్తాయి: బండి సంజయ్*
ఖమ్మం జిల్లా :ఆగస్టు 27
ఖమ్మం వేదికగా జరిగిన రైతు ఘోష :బీజేపీ భరోసా బహిరంగ సభలో బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు.
కేసీఆర్ పేరు దుబాయ్ శేఖర్. దుబాయ్ అని బొంబాయి తీసుకుని పోయిన కేసీఆర్. కోడుకు పేరు అజయ్ రావు…టిక్కెట్ కోసం కేటిఆర్ పేరు పెట్టాడు.
ఎన్నికలు వస్తే దళిత బంధు, రుణ మాఫీ గుర్తుకు వస్తుంది. ఒక పెగ్గు వేస్తాడు దళిత బంధు…రెండు పెగ్గులు వేస్తే డబుల్ బెడ్ రూం అంటాడు. మూడు పెగ్గులు వేస్తే రుణ మాఫీ అంటాడు. అని బండి సంజయ్ కుమార్ సెటైర్లు విసిరాడు.
అవినీతి పరులైన వారికి అమిత్ షా చిచ్చరపిడుగు. తెలంగాణ గడ్డపై పౌరు షాన్ని నింపిన ఖమ్మం గడ్డ. తెలంగాణ లో రామరాజ్యం నిర్మిద్దాం.” అని బండి సంజయ్ అన్నారు..
