Breaking News

ప్రజాదరణ కోల్పోతున్న బీ.ఆర్.ఎస్… బలపడుతున్న బిజెపి

105 Views

ప్రజాదరణ కోల్పోతున్న బీ.ఆర్.ఎస్… బలపడుతున్న బిజెపి

*కూకట్పల్లి నియోజకవర్గం ఆగస్టు 26* బాలానగర్ డివిజన్ లోని వినాయక నగర్ రెసిడెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఈరోజు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు ఆధ్వర్యంలో బీజేపీ లో చేరారు. అసోసియేషన్ సభ్యులకు రాజేశ్వర్ రావు కండువా కప్పి బీజేపీ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వర్ రావు మాట్లాడుతూ… నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీలోకి చేరికలు పెరుగుతాయని, కూకట్ పల్లిలో అధికార పార్టీకి ఓటమి ఖాయమని అన్నారు. బీజేపీ పార్టీలోకి అసోసియేషన్ ప్రెసిడెంట్ సిద్ది రాములు గుప్తా, వైస్ ప్రెసిడెంట్ వేణు, జనరల్ సెకరటరీ శివ కుమార్, ట్రెజరర్ యుగేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు నరేష్, నాగరాజ్, సిద్ధయ్య, సందీప్ గౌడ్, సతీష్ చారి, మహేష్, పాట్రో, ప్రవీణ్, నరేష్, లక్ష్మణ్, నాగరాజు, దయానంద్, సోమయ్య, మూర్తీలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ సురేందర్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు జి.రమేష్, ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్, మహిళా నాయకురాలు శివరంజని, లతా, వాణి, బిజెపి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *