దౌల్తాబాద్: గ్రామాల్లోని ఖాళీ స్థలాల్లో ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని జడ్పిటిసి రణం జ్యోతి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ ఇప్ప లక్ష్మి అన్నారు. శనివారం మండల కేంద్రమైన దౌల్తాబాద్ లో కోటి మొక్కల వృక్షార్చన కార్యక్రమంలో భాగంగా మల్లన్న గుడి వద్ద మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అన్నారు. నాటిన ప్రతి మొక్కను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. అనంతరం ఇందుప్రియల్, గాజులపల్లి గ్రామాల్లో సర్పంచులు శ్యామల కుమార్, అప్ప వారు శ్రీనివాస్ మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాజేష్ కుమార్, ఎంపీఓ గఫూర్ ఖాద్రి, సర్పంచ్ ముత్యం గారి యాదగిరి, ఎంపీటీసీ వీరమ్మ మల్లేశం, ఏపీవో రాజు తోపాటు ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు….
