-జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి కాల్వ సురేష్
సీజన్ మొదలై మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ గొర్రెలు, మేకల కు నట్టల నివారణమందులు ఇవ్వలేదని గొర్రెలు , మేకల పెంపకందార్ల సంఘం కరీంనగర్ జిల్లా కార్యదర్శి కాల్వ సురేష్ అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సంవత్సరానికి మూడు సార్లు ఇవ్వవలసిన నట్టల నివారణమందులు వర్షాకాలం మొదట్లో ఇవ్వవలసి ఉండగా ఆగష్టు నెల పూర్తి అవుతున్న నేటికీ ఇంకా నట్టలమందు జీవాలకు తాగించలేదని వెంటనే నట్టల నివారణ మందులు ఇప్పించాలని జిల్లా పశు వైద్య అధికారి కి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. అలాగే సీజనల్ వ్యాధులకు సంబంధించిన మందులు అందుబాటులో ఉంచాలని అవసరమున్న చోటా ప్రత్యేక క్యాంపు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రాథమిక గొర్రెల పెంపకం దారుల సహకార సొసైటీల ఎన్నికల పై గ్రామాల్లో అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలని కోరారు.
ఈసందర్భంగా జిల్లా అధికారి బి. నరేందర్ సానుకూలంగా స్పందించి త్వరగా మందులు ఇప్పించే ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్కురి సతీష్ కురుమ, చిట్కురి రాజమల్లు,ఇరు కొమురయ్య, ఇరుమళ్ల రాము,కడారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.