*శ్రీశైలం మల్లన్న సన్నిధిలో మంత్రి కొప్పుల దంపతులు*
తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖా మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
