Breaking News

ప్రెస్ మీట్ మంత్రి

194 Views

బిఆర్ఎస్ ఎల్పీ కార్యాలయం – మంత్రి కొప్పుల ఈశ్వర్ ….

కాంగ్రెస్ డిక్లరేషన్ ఓ బూటకం – మంత్రి కొప్పుల

కాంగ్రెస్ కు ఓట్ల మీద ప్రేమ తప్ప దళితుల మీద లేదు. – మంత్రి కొప్పుల

ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ను తెలంగాణలో కాదు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో విడుదల చేయాలి- మంత్రి కొప్పుల

ఈ సందర్భంగా ప్రెస్ మీట్ మంత్రి మాట్లాడుతూ

ఎన్నికలకు ముందు దళితులను ,గిరిజనులను కాంగ్రెస్ డిక్లరేషన్ పేరిట మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తోంది, దేశంలో 40 కోట్ల మందికి పైగా దళిత ,గిరిజనులు ఉన్నారు

50 సంవత్సరాలకు పైగా దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ దళిత ,గిరిజనులను మోసం చేసింది, వంచించి ఓట్లు వేయింకుంది, కాంగ్రెస్ మాటలు నమ్మేందుకు దళిత గిరిజనులు అమాయకులు కారు

మల్లిఖార్జున్ ఖర్గే ఈ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ను తెలంగాణ లో కాదు విడుదల చేయాల్సింది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దేశ వ్యాప్తంగా ఈ డిక్లరేషన్ విడుదల చేయాలి

కాంగ్రెస్ డిక్లరేషన్ ఎవ్వరూ నమ్మేలా లేదు, ఇన్నేళ్లు ఈ పథకాలు అమలు చేయాలని కాంగ్రెస్ కు ఆలోచన ఎందుకు రాలేదు

కాంగ్రెస్ హాయంలో దళిత గిరిజన విద్యార్థుల కోసం ఇన్ని రెసిడెన్షియల్ పాఠశాలలు కాలేజీలు పెట్టారా

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత మొత్తం 1006 రెసిడెన్షియల్ స్కూళ్ళు పెట్టాం, ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో దళిత గిరిజనులకు అడ్మిషన్లు దొరుకుతున్నాయంటే అది రెసిడెన్షియల్ విద్య ఫలితమే…

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దళిత బంధు లాంటి పథకం ఎందుకు లేదు, కేసీఆర్ తరహాలో దళిత బంధు పెట్టాలని కాంగ్రెస్ నేతలు ఎందుకు ఆలోచించలేదు

దళితులకు ఎన్నో పథకాలు అమలు చేస్తున్న తెలంగాణకు వచ్చి కాంగ్రెస్ నేతలు దళిత గిరిజనులకు డిక్లరేషన్ విడుదల చేస్తారు

దళితబంధు కోసం 12 లక్షల రూపాయలు కాదు కాంగ్రెస్ కు దమ్ముంటే తమ పాలిత రాష్ట్రాల్లో ఐదు లక్షలు ఇవ్వండి, కేవలం ఎన్నికలు ఉన్నాయనే తెలంగాణ లో డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ డ్రామాలు ఆడుతోందని మంత్రి ఎద్దేవా చేశారు

కాంగ్రెస్ కు ఓట్ల మీద ప్రేమ తప్ప దళితుల మీద లేదు, దళిత గిరిజనులకు దేశంలో ఎక్కడా లేని సంక్షేమం అమలవుతోంది, కాంగ్రెస్ నేతల ఆపద మొక్కులను ఎవ్వరూ నమ్మరు

ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టిన పథకాలకు మెరుగులు దిద్ది ఎదో చేస్తామని కాంగ్రెస్ భ్రమలు కల్పిస్తోంది

మళ్ళీ బిఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది..మరింత సమర్ధంగా పథకాలు అమలు చేస్తాం, ఎనిమిదేళ్లలో దళితబంధు అన్నీ దళిత కుటుంబాలకు అందుతుంది..

60 ఏళ్ళు ఓపిక పట్టిన దళిత సోదరులు మరో ఎనిమిదేళ్లు ఓపిక పడతారు, కాంగ్రెస్ మాయ మాటలు ఎవరూ నమ్మరు, కాంగ్రెస్ డిక్లరేషన్ ఓ బూటకం,

దళిత బంధు లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది అనేది దుష్ప్రచారం మాత్రమే, ఎన్నికలు ఎలా వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం

115 మంది అభ్యర్థులతో మేము జాబితా విడుదల చేసుకోవడం మా ఎన్నికల సంసిద్ధతకు నిదర్శనం

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *