ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం – బోర్లకుంట వెంకటేష్ నేత, మాజీ ఎంపీ
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు చేయాలని, ఎన్టీఆర్ నగర్ నీట మునిగిన ఇండ్ల వరద బాధితులకు నష్టం పరిహారం మరియు వరదతో పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ నాయకులు, మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత మరియు బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొన్నారు. ముందుగా మంచిర్యాల ఐబీ చౌరస్తా నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు పాద యాత్రగా వెళ్ళిన అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట వరద బాధితులతో కలిసి ధర్నా చేపట్డడం జరిగింది. అనంతరం జిల్లా కలెక్టర్ ని కలిసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని మరియు వరద బాధితులకు నష్ట పరిహారం అందించాలని వినతి పత్రం అందజేయడం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. అమలుకు నోచుకోని హామీలు ఇచ్చి లేదా ప్రజలను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. వరదలతో ఎన్టీఆర్ నగర్ ప్రజలు మరియు రైతులు నష్టపోతే ఇప్పటి వరకు ప్రభుత్వం బాధితులను ఆదుకోలేదు. ఎన్నికల సమయంలో ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పి కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ముల్కల్ల మల్ల రెడ్డి, కొయ్యల ఎమాజీ, దుర్గం అశోక్, వంగపల్లి వెంకటేశ్వర్ రావు, ఎలగందుల కృష్ణ మూర్తి, జోగుల శ్రీదేవి, గాజుల ముఖేష్ గౌడ్, కమలాకర్ రావు, ముత్తె సత్తయ్య, బియ్యాల సతీష్ రావు, మంత్రి సురేఖ, వైద్య శ్రీధర్, అమిరిశెట్టి రాజ్ కుమార్, కుర్రె చక్రి, గోలి రాము మరియు తదితరులు పాల్గొన్నారు.





