–అస్సాం రాష్ట్ర బిజెపి ఎమ్మెల్యే దిగంత కలిత.
ప్రజల సంక్షేమం, దేశ భవిష్యత్తు కోసమే బీజేపీ పనిచేస్తుందని అస్సాం రాష్ట్రం కమల్ పూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే దిగంత కలిత పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం లోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం మరియు గెలుపు కోసం అనుసరించాల్సిన విధానాలపై జాతీయ పార్టీ ఆదేశాల మేరకు వివిధ రాష్ట్రాలనుండి బీజేపీ ఎమ్మెల్యే లు పర్యటిస్తున్నారు.ఈ సందర్బంగా అస్సాం రాష్ట్రం కమల్ పూర్ ఎమ్మెల్యే దిగంత కలిత శుక్రవారం తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో మండల నాయకులతో పలు అంశాలపై మాట్లాడారు అనంతరం వివిధ గ్రామాల్లో పర్యటించారు.బూత్ స్థాయిలో అధ్యక్షులు కార్యకర్తలు చేయాల్సిన ముఖ్యమైన పార్టీ పనులను వివరించారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని తెలిపారు.కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండాలని సూచించారు. కొత్తపెల్లి గ్రామంలో కొన్ని ఇండ్ల వద్ద కమలం పువ్వుతో కూడిన చిత్రాన్ని ఆయనే స్వయంగా రంగులతో వేసారు.గ్రామంలోని ప్రధాన కూడళ్ళ వద్ద పార్టీ గుర్తుతో చిత్రాన్ని వేయాలని కార్యకర్తలకు సూచించారు.కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులతో ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్ లను పరిశీలించారు.మండలంలోని బూత్ కమిటీ లు, శక్తి కేంద్రాలు, మండల కమిటీ, పలు మోర్చా కమిటీ ల పనితీరు ను అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గుర్రాల వెంకట్ రెడ్డి,జిల్లా కార్యదర్శి రంగు భాస్కరచారి,మానకొండూర్ అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి,మానకొండూర్ నియోజకవర్గ ఆశావాహులు గడ్డం నాగరాజు, సొల్లు అజయ్ వర్మ,జిల్లా కార్యవర్గ సభ్యులు మావురపు సంపత్,ప్రధాన కార్యదర్శులు కిన్నెర అనిల్, గొట్టిముక్కల తిరుపతి రెడ్డి,మండల ఉపాధ్యక్షులు మార్క హరికృష్ణ గౌడ్,ఒడ్నాల రవీందర్,పబ్బ తిరుపతి, జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు బోనాల మోహన్, అధికార ప్రతినిధి వేల్పుల రవీందర్,ఓబీసీ మోర్చా జిల్లా కార్యదర్శి ఎర్రోజు లక్ష్మణ్, జిల్లా ఈసీ మెంబర్ కొయ్యడ శ్రీనివాస్ గౌడ్,బిజెవైఎం అధ్యక్షులు గడ్డం అరుణ్,దళిత మోర్చా అధ్యక్షులు ఎల్కపల్లి స్వామి,ఓబీసీ మోర్చా అధ్యక్షులు దుర్సెట్టి రమేష్ తదితరులు పాల్గొన్నారు.




