Breaking News

ప్రచారానికి వస్తేనే.. ప్రభుత్వ పథకాలు.*

73 Views

*ప్రచారానికి వస్తేనే.. ప్రభుత్వ పథకాలు.*

*వరంగల్ : “వరంగల్కు చెందిన ఓ డబుల్ బెడ్రూం లబ్ధిదారుడికి బీఆర్ఎస్ కార్పొరేటర్ ఫోన్చేశాడు. ఈ రోజు మధ్యాహ్నం మన ఎమ్మెల్యే సార్మీటింగ్ ఉంది*.

కచ్చితంగా రావాలె మీ అపార్ట్మెంట్లో ఉన్న మిగతా 12 మందికి కూడా చెప్పు అని ఫోన్ కట్ చేశాడు అతడు అదే సమయంలో బంధువుల ఇంటికి వెళ్లాల్సి ఉన్నా..ఇష్టం లేకుండానే ఆ లీడర్ప్రోగ్రామ్కు అటెండయ్యాడు ఇలా ప్రభుత్వ స్కీముల లబ్ధిదారులను కొత్తగా అప్లై చేసుకునోళ్లకూ బీఆర్‍ఎస్‍ లీడర్లు ఫోన్లు చేసి బెదిరిస్తూ తమ ప్రచారానికి వాడుకుంటున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ఆయా స్కీములకు లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకోగా వందల్లో మాత్రమే దక్కే అవకాశం ఉండటంతో తీవ్ర పోటీ నెలకొంది దీంతో అధికార పార్టీ నేతలు ఈ కొత్త ఆలోచనకు తెరతీశారు అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందే అధికార బీఆర్ఎస్ సిట్టింగులకు టికెట్లు ఇవ్వడంతో నియోజకవర్గాల్లో ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు సభలు సమావేశాలతో పాటు ఇంటింటి ప్రచారంలో లీడర్ల వెంట జనాలు ఉండేలా చూసుకుంటున్నారు. మామూలుగా కూలీలను పెట్టుకుంటే రోజుకు రూ.500 ఇవ్వాలి అప్పుడు ప్రచారం ఖర్చు కాస్తా తడిసిమోపెడవుతుంది. దీంతో పలువురు ఎమ్మెల్యేలు ఈ కొత్త ఆలోచన చేశారు లోకల్ లీడర్ల ద్వారా ప్రభుత్వ స్కీముల ద్వారా లబ్ధి పొందిన వారికి కొత్తగా అప్లై చేసుకున్న వాళ్లకు ఫోన్చేయించి ప్రోగ్రామ్స్కు అటెండ్అయ్యేలా చూసుకుంటున్నారు. రానివాళ్లకు స్కీములు రాకుండా చేస్తామని హెచ్చరిస్తున్నారు.

*ఫాయిదా పొందితే చాలు ఫోన్కొట్టుడే..*

డబుల్ బెడ్ రూమ్ దళితబంధు కల్యాణలక్ష్మి పింఛన్లు ఇలా గవర్నమెంట్స్కీమ్లతో లబ్ధిపొందిన వారినే లక్ష్యంగా చేసుకొని ప్రోగ్రామ్స్కు తరలిస్తున్నారు పెద్దనేతలు డైరెక్ట్గా పబ్లిక్ను సంప్రదించకుండా తమ అనుచరులకు సమాచారమిచ్చి ప్రజల్ని తీసుకురావాలని సూచిస్తున్నారు వార్డ్మెంబర్మొదలుకొని కౌన్సిలర్లు ఎంపీటీసీలు సర్పంచులు జడ్పీటీసీలు ఎంపీపీలు చైన్ సిస్టమ్ తరహాలో జనాన్ని తరలించే బాధ్యతలు తీసుకుంటున్నారు. మరోవైపు దళితబంధు, గృహలక్ష్మి బీసీలోన్లు లాంటి స్కీములకు అప్లై చేసుకొని ఎదురుచూస్తున్న వాళ్లనూ ప్రచారానికి తరలిస్తుండడం గమనార్హం.

ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రెండో విడత దళితబంధు పథకాన్ని ఒక్కో నియోజకవర్గానికి 1,100 మందికి ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఒక్కో గ్రామం నుంచి వందలాది మంది అప్లై చేసుకున్నారు అటు గృహలక్ష్మి పథకానికీ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 17 లక్షల అప్లికేషన్లు వచ్చాయి ప్రతి నియోజకవర్గంలో సగటున 13 వేల అప్లికేషన్లు రాగా, ప్రభుత్వం మాత్రం నియోజకవర్గంలో 3 వేల మందికి మాత్రమే ఇవ్వనున్నట్లు చెబుతోంది. ఇక జులై నెలలో ప్రవేశపెట్టిన బీసీ లోన్ల కోసం రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షలకుపైగా దరఖాస్తులు వచ్చాయి ఒక్కో సెగ్మెంట్కు 335 మంది చొప్పున లిస్ట్ రూపొందించారు ఇది నిరంతర ప్రక్రియ అని చెప్పడంతో మిగతావారూ ఆశగా ఉన్నారు ఇప్పుడు వీళ్లంతా లీడర్ల ప్రచారానికి పావులుగా మారుతున్నారు.

*దళితబంధు వెహికల్స్నూ మీటింగులకు పెట్టాల్నట*

దళితబంధు రెండో విడత లబ్ధిదారుల సెలక్షన్‍ పవర్‍ పేరుకు కలెక్టర్కు ఇచ్చినా మళ్లీ ఎమ్మెల్యేల హవానే నడుస్తున్నదన్న ఆరోపణలు వినపడుతున్నాయి దీంతో వాళ్ల ఇష్టారాజ్యం నడుస్తున్నది దళితబంధు స్కీమ్లో కార్లు దక్కించుకున్నవారు తాము చెప్పిన సమయాల్లో పార్టీ నిర్వహించే ప్రచారాలు సభలు సమావేశాలకు వెహికల్స్ పెట్టాలని లీడర్లు చాలాచోట్ల ముందస్తు కండిషన్‍ పెడ్తున్నారు. తద్వారా స్కీమ్ పొందినవారు తమ వాహనాలు ఉచితంగా ప్రచారాలకు అందుబాటులో ఉంచడానికి తోడు ఆ వాహనాల్లో మరో ఐదారుగురిని సమావేశాలకు రప్పించుకుంటున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు.

*ఇల్లు, లోన్‍ కావాలంటే ప్రచారానికి రావాలే..*

గృహలక్ష్మి స్కీమ్లో ఇల్లు, బీసీ లోన్‍ వంటివి మహా అయితే ఒక్కో గ్రామానికి కేవలం 05 నుంచి 10 మందికి కూడా దక్కే అవకాశం కన్పించడంలేదు. కానీ ఒక్కో ఊరు నుంచి వందలు వేల అప్లికేషన్లు వచ్చాయి దీంతో లబ్ధిదారుల మధ్య ఫుల్లు కాంపిటీషన్‍ ఉంది ఆ పథకాలను అర్హులకు అందించాల్సిన ఆఫీసర్లు రాజకీయ ఒత్తిళ్లతో ప్రజాప్రతినిధులు ఇచ్చిన పేర్లనే చేర్చుతున్నారు గ్రామ స్థాయి లీడర్లు ఒకరికి తెలియకుండా మరొకరితో ఫలానా స్కీమ్ నీకే ఇచ్చేలా పైరవీ చేశానంటూ చెప్పుకుంటున్నారు.

దీని కోసం ఎంతోకొంత కమీషన్‍ ఇవ్వడానికితోడు పార్టీ తరఫున నిర్వహించే ప్రచారాలకు విధిగా అటెండ్‍ అవ్వాలని కండిషన్‍ పెడ్తున్నారు ఇందులోనూ ఓటు బ్యాంకు ఎక్కువ ఉండే కుటుంబాలను సెలక్ట్ చేయడం ద్వారా ఓట్లన్నీ బీఆర్‍ఎస్‍ పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్‍కు వేయాలని మాట తీసుకుంటున్నారు దీంతో జనాలు తమ పనులు బంద్‍ చేసుకుని ఎమ్మెల్యే ప్రచారంలో పాల్గొంటున్నారు.

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *