ప్రాంతీయం

పోష్ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

5 Views

పోష్ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి,జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల జిల్లా
ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్ మెంట్ (పోష్)- 2013 చట్టం పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ విలాయత్ అలీ, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. అనిత, జిల్లా పశు వైద్య, పశుసంవర్ధక శాఖ అధికారి శంకర్, స్థానిక, అంతర్గత ఫిర్యాదుల కమిటీల ప్రతినిధులు కవిత, శివ కీర్తి లతో కలిసి వివిధ శాఖల జిల్లా అధికారులు, మహిళ ఉద్యోగులతో పోష్ చట్టం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పోష్ చట్టంపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. పని ప్రదేశాలలో మహిళలపై లైంగిక వేధింపుల నిరోధం, నివారణ, పరిష్కారంపై తెలుసుకోవాలని, మహిళల సంక్షేమం కొరకు ఈ చట్టం తీసుకురావడం జరిగిందని తెలిపారు. జిల్లాలో స్థానిక, అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలందరికీ తెలిసే విధంగా విస్తృత ప్రచారం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. మహిళలకు తాము పని చేసే ప్రదేశాలలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా ఈ కమిటీలను సంప్రదించవచ్చని, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు. జిల్లా స్థాయిలో స్థానిక ఫిర్యాదుల కమిటీ కొనసాగుతుందని, కనీసం 10 మంది పని చేసే జిల్లా శాఖ కార్యాలయాలలో అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేసి జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయానికి వివరాలు తెలియజేసినట్లయితే ఆన్ లైన్ షీ బాక్స్ పోర్టల్ లో నమోదు చేయడం జరుగుతుందని,జిల్లాలో ఇప్పటివరకు 47 అంతర్గత ఫిర్యాదుల కమిటీలు కొనసాగుతున్నాయని తెలిపారు. అసంఘటిత రంగాలలో పని చేస్తున్న మహిళలు ఫిర్యాదు కొరకు స్థానిక కమిటీని సంప్రదించవచ్చని, ఈ కమిటీలలో ఫిర్యాదు చేసిన 90 రోజులలో విచారించిన తరువాత 10 రోజులలో ఫిర్యాదు నివేదికను సంబంధిత జిల్లా అధికారికి సమర్పించడం జరుగుతుందని, నివేదిక అందిన 6 నెలల సమయంలోగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఫిర్యాదులో తుది తీర్పు సంతృప్తికరంగా లేనట్లయితే అప్పీలు కొరకు ట్రిబ్యునల్/ న్యాయస్థానాన్ని సంప్రదించవచ్చని తెలిపారు. లైంగిక వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని, పని ప్రదేశాలను మహిళలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా కమిటీకి ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా తప్పుడు ఫిర్యాదులు చేసినట్లయితే సదరు ఫిర్యాదుదారులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటూ జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు. సంఘటన జరిగిన 3 నెలల వ్యవధిలోగా ఫిర్యాదు చేయాలని, మహిళల సంక్షేమం కోసం హెల్ప్ లైన్ టోల్ ప్రీ నంబర్ 181 ఏర్పాటు చేయడం జరిగిందని, సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం చట్టం సంబంధిత గోడ ప్రతులను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

*మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది*

IMG-20251226-WA0281
IMG-20251226-WA0281

Poll not found
జిల్లపేల్లి రాజేందర్ ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *