బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి స్ఫూర్తితో బహుజన రాజ్యాన్ని సాధిద్దాం
-మార్కుక్ బిఎస్పీ నాయకులు
బహుజన్ సమాజ్ పార్టీ మార్కుక్ మండల అధ్యక్షులు ఇసకంటి బాబు గారి ఆధ్వర్యంలో బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374 జయంతి ఉత్సవాలను పాములపర్తి గ్రామంలో నిర్వహించడం జరిగింది.ఉత్సవాలకు ముఖ్య అతిథిగా గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జి కొండనోళ్ళ నరేష్ గారు, నియోజకవర్గ కోశాధికారి మొండి కర్ణాకర్ గారు హాజరై బహుజన్ పాపన్న కర్ణాకర్ గారు ఈ సందర్భంగా ప్రసంగించారు. స్థాపించాల్సిన అవసరం లేదని అన్నారు.వేయిలాది మంది బహుజన విద్యార్థుల బలిదానాల మీద ఏర్పడ్డ తెలంగాణ దొర చేతుల్లో బందీ అయ్యింది.సర్దార్ పాపన్న గౌడ్ ఏ దొరల, ఆధిపత్య వర్గ భూస్వాముల నిరంకుశత్వ పాలనకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉందని అదే పాలనను గజ్వేల్ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ లో కొనసాగిస్తున్నారని మండి పడ్డారు. 9 సంవత్సరాల నుండి గుర్తు రాకుండా ఇప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం BC బంధు, SC బంధు, మైనారిటీ బంధు పేరుతో బహుజనులను మోసం చేసినట్లు పేర్కొన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగులు కల్పించకుండా వారి ఆత్మహత్యలకు కారకుడు అవుతున్నాడని తెలిపారు.నియంతృత్వ పాలను గద్దె దించి పాపన్న గౌడ్ స్పూర్తితో బహుజనులు ఏకమై బహుజన రాజ్యాన్ని స్థాపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శరదని రాము, అరుణ్, కొండనోళ్ళ వంశి, శరదని శ్రీశైలం, కర్రోళ్ల నవీన్, రాజంగారి భాను, బాలగిరి, ఇప్పలగూడెం నాయకులు తెడ్డు నవీన్, అనిల్ గార్లు మరియు గ్రామ నాయకులు పాల్గొన్నారు.
