Breaking News

_డాక్టర్ నిర్లక్ష్యంతో మహిళ మృతి … శవంతో హాస్పటల్ వద్ద బంధువులు ధర్నా_* _భద్రాద్రి కొత్తగూడెం

115 Views

*_డాక్టర్ నిర్లక్ష్యంతో మహిళ మృతి … శవంతో హాస్పటల్ వద్ద బంధువులు ధర్నా_*

_భద్రాద్రి కొత్తగూడెం అశ్వారావుపేట నియోజకవర్గం ,దమ్మపేట పట్టణంలో భవాని నర్సింగ్ హోమ్ వద్ద ఉద్రిక్తత. చోటు చేసుకుంది._

_దమ్మపేట మండలం అల్లిపల్లి గ్రామానికి చెందిన పాండ్ల నందిని (26) అనే మహిళ మృతిచెందింది డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే మృతి చెందింది అంటూ హాస్పటల్ వద్ద బంధువులు గురువారం ఆందోళన. చేపట్టారు. మహిళ మృత దేహంతో రహదారిపై రాస్తారోకో నిర్వహించారు._

_ఈ హాస్పటల్ లో ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నా అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదంటూ మృతురాలి బంధువులు ఆరోపణ చేశారు._

_ఆదివాసీ బిడ్డకు న్యాయం జరిగేవరకు ఆందోళన విరమించేది లేదంటు బంధువులు , ఆదివాసీ సంఘాలు నేతలు అక్కడే బైఠాయించారు…!!_

No Slide Found In Slider.

Poll not found
Manne Ganesh Dubbaka constancy 9701820298

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *