Breaking News

ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌లో చేరికలపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.

91 Views

హైదరాబాద్‌: ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌లో చేరికలపై పార్టీ నిర్ణయం తీసుకుంటుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. కాసేపట్లో హైదరాబాద్‌లోని కోమటిరెడ్డి నివాసంలో తెలంగాణ కాంగ్రెస్‌ ముఖ్యనేతల సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో పాటు ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడారు.

 

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధించేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చిస్తామని కోమటిరెడ్డి తెలిపారు. బస్సు యాత్ర చేయాలా? ఇతరత్రా మార్గాల్లో ముందుకెళ్లాలా? అనేది సమావేశంలో నిర్ణయిస్తామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 12 స్థానాల్లోనూ కాంగ్రెస్‌ గెలుస్తుందని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *