పాడి పంటల క్షేమానికి జరిపే పండుగ తీజ్ పండుగ…
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈ పండుగకు ప్రత్యేక గుర్తింపు ఇస్తాం.
కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజక వర్గ నాయకులు అజ్మీరా శ్యామ్ నాయక్ లింగాపుర్ మండలంలో పలు గ్రామాల్లో జరిగిన తీజ్ పండుగ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజా నాయకుడు.
ఆసిఫాబాద్ జిల్లా లింగా పుర్ మండలంలో జరిగిన తీజ్ పండుగ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ ఆసిఫాబాద్ నియోజక వర్గ నాయకులు అజ్మీరా శ్యామ్ నాయక్ మాట్లాడుతూ సనాతన ధర్మం బంజారా సంప్రదాయ పద్ధతుల్లో పాడి పంటలు బాగా పండాలని వాటికి ఏటువంటి ప్రమాదాలు జరగకుండా తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మాయిలు బొంగు కర్ర బుట్టలో మట్టితో పాటు మొలిసిన ధాన్యపు మొక్కలతో ఆ భగవంతుడిని మొక్కుతారు అని చెప్పుకొచ్చారు మనం జీవిస్తున్న ఈ ప్రకృతి కూడ ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని కోరుకునే సాంప్రదాయ పండుగ జరుపుకోవడం చాలా గొప్ప విషయం అని చెప్పుకొచ్చారు శ్రావణ మాసం లో జరిపే ఈ పండుగ ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి జరుపుతున్న ఈ పండుగ ప్రపంచంలో లోనే శక్తి వంతమైన దేశం అమెరికా దేశం లో కూడా ఈ పండుగ జరుపుకోవడం జాతి గర్వవించదగ్గ విషయము అని చెప్పుకొచ్చారు ఇలా ఈరోజు లింగా పూర్. కొత్తపల్లి. మమాడి పల్లి . గోపాల్ పూర్.భీమ్ పూర్. కొత్తపల్లి . అణార్ పల్లి.తుమ్మ గుడ. జైరామ్ గుడ. సులతాన్ గూడ. కేరామేరీ లో పాల్గొన్న శ్యామ్ నాయక్ బంజారా సంప్రదాయ పద్ధతిలో నృత్యం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది అడుగడుగునా బ్రహ్మరథం తో స్వాగతం పలికిన ప్రజలను పలకరిస్తూ నేటి పర్యటనను విజయవంతం గా ముగించారు. ఈ కార్యక్రమంలో ఈరొజు వారి ఆ ఆ మండలాల స్థానిక ప్రజా ప్రతినిధులు గ్రామస్థులు సీనియర్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.