*:-భూమి తమదేనంటూ* *బెదిరింపులు ముగ్గురిని తాడుతో చెట్టుకు కట్టేసిన స్థానికులు* *
కరీంనగర్ ఆగష్టు 17:-* రాచర్ల కరీంనగర్* . భూమి ఒకటే… డాక్యూమెంట్లు మాత్రం ఎన్నో… ఎలా తయారవుతున్నాయో తెలియదు… ఎక్కడి నుండి పుట్టుకొస్తున్నాయో తెలియదు కాని ఒకే భూమి పేరిట క్రియేట్ అవుతున్న డాక్యూమెంట్లతో భూ యజమానులు రోడ్డుపై పడితే అక్రమార్కులు అర్థికంగా బలపడిపోతున్నారు. ఫేక్ డాక్యూమెంట్స్ క్రియేట్ చేసే గ్యాంగుల వ్యవహారంతో భూ దందాల సమస్యలు ఝటిలంగా మారిపోతున్నాయి. తాజాగా మానకొండూరు మండలంలో చోటు చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. చెంజర్ల సమీపంలో భూమిని కొనుగోలు చేసిన వ్యక్తి కంపౌండ్ వాల్ నిర్మించుకుంటుండగా ఈ భూమి తమదేనంటూ కొంతమంది వ్యక్తులు ప్రత్యక్ష్యం అయ్యారు. ఆ భూమి కొనుగోలు చేసిన వ్యక్తి షాకుకు గురై అమ్మిన భూ యజమానులకు సమాచారం ఇచ్చాడు. దశాబ్దాల కాలంగా తాము సాగు చేసుకుంటున్న భూమిలోకి ఎలా వచ్చారంటూ ఆగ్రహించి వారిని చెట్టుకు కట్టేసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటనలో తిమ్మాపూర్ మండలం రేణికుంటకు చెందిన రాజుగౌడ్, కర్ణాకర్, దివాకర్ లపై సీడ్ ప్లాంట్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని మానకొండూరు సీఐ రాజ్ కుమార్ తెలిపారు. అలాగే రేణిగుంటకు చెందిన వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడా సీడ్ ప్లాంట్ యజమానిపై కేసు నమోదు చేశామన్నారు.
