ముస్తాబాద్, ప్రతినిధి వెంకటరెడ్డి ఆ
గస్టు16, వెంకట్రావు పల్లె గ్రామంలోని శ్రీపెద్దమ్మ దేవాలయంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు పిట్లరాంగోపాల్ ఆధ్వర్యంలో జిల్లా మత్స్యశాఖ ఛైర్మెన్ చొప్పరి రాంచెంద్రం కార్యవర్గానికి సన్మానించారు. ఈకార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరై రాజన్న సిరిసిల్ల జిల్లా ఫిషరీస్ ఫెడరేషన్ చైర్మన్ చొప్పరి రామచంద్రం మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీలో నాణ్యమైన సీడ్ అందేవిధంగా కృషి చేస్తానని, శాస్ర్తీయ పద్ధతుల్లో చేపలు ఎలా పెంచాలి అనే విషయాల పట్ల అవగాహన సదస్సులు నిర్వహించి జిల్లాలో మహిళ మత్స్యశాఖ మార్కెట్ సొసైటీలు ఏర్పాటుకు తగు చర్యలు తీసుకుంటానని సిరిసిల్ల జిల్లాలకు సంబంధించిన మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు మెరుగు పడేవిధంగా సబ్సిడీ ద్వారా ద్విచక్ర వాహనాలు, వలలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈకార్యక్ర మంలో జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు రాణవేని లక్ష్మణ్, ముస్తాబాద్ మండల డైరెక్టర్ గాడిచెర్ల దేవయ్య, బీసీస్టడీ సర్కిల్ చేయిర్మెన్ జెల్ల వెంకటస్వామి, గంభీరవుపేట డైరెక్టర్ గాడిచెర్ల శ్రీనివాస్, అధ్యక్షులు చొక్కాలరాము, మాజీ ఎంపిటిసి గజ్జెలరాజు మండల ఉపాఅధ్యక్షుడు చాడ శ్రీనివాస్, జెల్ల నర్సయ్య, మార్కంటి నర్సయ్య, అగ్రారం రాములు, రాంచెందరం ,రాజు, శేఖర్ మండలంలోని వివిధ గ్రామాల ముదిరాజ్ సంఘాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.




