వీధి కుక్కలు దాడి చేసిన సంబంధిత అధికారులు పట్టించుకోరా
బహుజన లెఫ్ట్ పార్టీ
సిద్దిపేట జిల్లా, అక్టోబర్ 14
సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వీధి కుక్కలు విచ్చలవిడిగా వీధులలో తిరుగుతూ ప్రజలపై దాడి చేస్తున్నాయి .ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా బి ఎల్ పి నాయకులు శివరాత్రి శ్రీనివాస్, మాట్లాడుతూ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జడ్.పి.హెచ్.ఎస్ స్కూల్ సమీపంలో ఉన్న వడ్డెర కాలనీ ఒకటో వార్డుకు చెందిన స్థానికులు అనేకసార్లు కుక్కల దాడికి గురయ్యారు బయట గల్లీలో తిరగాలంటే భయపడుతూ కుక్కలు ఎక్కడ దాడి చేస్తాయో అని పిల్లల్ని బయటకి పంపియాలంటే అరచేతుల్లో ప్రాణాలు పెట్టుకొని, ఎన్నిసార్లు స్థానిక మున్సిపల్ యాజమాన్యానికి చెప్పిన ఎవరు పట్టించుకుంటలేరు, వెంటనే ఈ యొక్క వీధి సింహాలపై చర్యలు తీసుకొని వీటిని ఇక్కడి నుంచి తరలించాలని స్థానికులు కోరారు ఈ కార్యక్రమంలో బి ఎల్ పి నాయకులు దబ్బెట ఆనంద్, సడిమెల డేవిడ్, కోటగిరి, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.





