-ఈదేశ ప్రతి పౌరులు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను గౌరవించాలి
ఆదివారం మానకొండూర్ మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్అంబేద్కర్ విగ్రహనికి పూలమాలవేసి తిరంగా యాత్ర ప్రారంభించారు. తూర్పు దర్వాజా మీదగా,పల్లె మీద చౌరస్తా నుండి అలుగునూర్ చౌరస్తా వరకు “తిరంగా యాత్ర” జాతీయ గీతాల పాటలతో, జాతీయ జెండాలు చేత పట్టుకొని బైక్ యాత్ర ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ కార్యక్రమ జిల్లా కన్వీనర్ బిజెపి జిల్లా కార్యదర్శి రంగు భాస్కరాచారి, మానకొండూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జి గడ్డం నాగరాజు మాట్లాడుతూ.. దేశ సమైక్యత కోసం ప్రతి పౌరుడు సైనికులాగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలని అప్పుడే దేశ సమైక్యత ఉంటుందన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సంవత్సర కాలం పాటు “ఆజాదికా అమృత్ మహోత్సవాల” పేరిట పలు రకాల దేశ సమైక్యత కార్యక్రమాలను నిర్వహించడం గర్వకారణం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు మాడ వెంకటరెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ ముత్యాల జగన్ రెడ్డి, ప్రోగ్రాం నియోజకవర్గ కోఆర్డినేటర్ మియాపురం లక్ష్మణాచారి, మానకొండూరు, తిమ్మాపూర్, శంకరపట్నం, గన్నేరువరం మండలాల అధ్యక్షులు రాపాక ప్రవీణ్,సుగుర్తి జగదీశ్వరచారి, ఏనుగుల అనిల్, నగునూరి శంకర్, నాయకులు అప్పాని తిరుపతి, మొగిలి శ్రీనివాస్, ఎర్రోజు లక్ష్మణ్, సోన్నాకుల శ్రీనివాస్, కిన్నర అనిల్, గొట్టముక్కల తిరుపతిరెడ్డి, కత్తి ప్రభాకర్ గౌడ్, భాషబోయిన ప్రదీప్ యాదవ్, పంబాల రాజశేఖర్, మార్కొండ రమేష్ పటేల్, ఆసరి రమేష్ యాదవ్, వీరగోని రాజు, నందగిరి బలరాం, కొండ్ర వరప్రసాద్, పిట్టల నరేష్, కాల్వ సాయి, నూనె కొండాల్, గౌరవేణి శ్రీనివాస్, బండి సాగర్, రేగుల శ్రీనివాస్, సాత్విక్ రెడ్డి, సుగుణాకర్,అశోక్, తాళ్లపల్లి పరశురాములు, జి. మోహనచారి, సాయిగణేష్, పవన్, బుర్ర శ్రీనివాస్, వేల్పుల తిరుపతి, అరవింద్, శ్రీకాంత్, వైదిక రావు,సంపత్ పాల్గొన్నారు.