Breaking News

పారేసిన కన్నతల్లి

214 Views

ఆడ శిశువును ముళ్ళ పొదలో పారేసిన కన్నతల్లి

ములుగు జిల్లా:అక్టోబర్ 04

ములుగు జిల్లాలో అమానవనీయ ఘటన చోటు చోసుకుంది. తల్లి పొత్తిళ్లలో వెచ్చగా నిద్రించాల్సిన చిట్టితల్లిని కర్కశంగా వదిలేశారు. పసిపాప తల్లిదండ్రులు.

ఈ విషాదకర సంఘటన జిల్లాలోని వెంకటాపురం నూగూరు మండలం పాత్రపురం గ్రామంలో చోటు చేసుకుంది.

స్థానికుల కథనం మేరకు.. అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు చెట్ల పొదల్లో వదిలేసి వెళ్లిపోయారు.

అటుగా వెళ్తున్న స్థానికులు పొదల్లో ఆడ శిశువు ఏడుపు విని అధికారులకు సమాచారం అందించారు. అక్కడి చేరుకున్న అధికారులు చిన్నారిని రక్షించి దవాఖానకు తరలించారు.

శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. ఆడపిల్ల పుట్టడంతో తల్లిదండ్రులే శిశువును వదిలించుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *