Breaking News

మరో కొత్త ఫీచర్‌.. ఒకే వాట్సాప్‌లో వేర్వేరు అకౌంట్లు వినియోగించేలా..*

145 Views

*మరో కొత్త ఫీచర్‌.. ఒకే వాట్సాప్‌లో వేర్వేరు అకౌంట్లు వినియోగించేలా..*

*ఒకే యాప్‌లో రెండు వేర్వేరు వాట్సాప్‌ ఖాతాలను ఉపయోగించే విధంగా ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.*

*ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. వినియోగదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఇప్పటికే లాక్‌చాట్‌, స్క్రీన్ షేరింగ్, మల్టీ డివైజ్‌ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చిన వాట్సాప్.. ఇప్పుడు మరో కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఒకే వాట్సాప్‌ యాప్‌లో వేర్వేరు ఖాతాలను ఉపయోగించే వెసులుబాటు కల్పించింది.*

*ఒక ఫోన్‌లో కేవలం ఒకే వాట్సాప్‌ ఖాతాను వినియోగించాటానికి మాత్రమే ప్రస్తుతం వాట్సాప్‌ అనుమతిస్తోంది. ఒక వేళ మరో వాట్సాప్‌ అకౌంట్‌ని వినియోగించాలంటే వేరే ఫోన్‌ అయినా ఉండాలి. లేదా క్లోన్డ్‌ వాట్సాప్ యాప్‌ అయినా ఉపయోగించాల్సి ఉంటుంది. రెండు వాట్సాప్ ఖాతాలు ఉపయోగించటం కోసం రెండు మొబైల్స్‌ వాడాలంటే కష్టం. పోనీ క్లోన్డ్‌ వాట్సాప్‌ వెర్షన్‌ వాడాలంటే భద్రతా పరమైన చిక్కులు ఎదురవుతాయి. వీటికి చెక్ పెట్టడానికే వాట్సాప్‌ ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీని సాయంతో ఒకే వాట్సాప్‌తో వేర్వేరు అకౌంట్లు వినియోగించవచ్చు.*

*ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిన వారు వాట్సాప్‌ అకౌంట్‌లో క్యూఆర్ కోడ్ ఆప్షన్ వద్ద ఉన్న ‘యారో (బాణం)’ ఐకాన్‌ సాయంతో మరో అకౌంట్‌ని యాడ్‌ చేసుకోవచ్చు. దీంతోనే వేరే ఖాతాకు మారవచ్చు. అప్పుడు వినియోగదారులు ఒకే ఫోన్లో వేర్వేరు నంబర్లతో వాట్సాప్‌ ఖాతాలను నిర్వహించే సౌలభ్యాన్ని పొందవచ్చు. ఒక ఖాతాలో ప్రైవేటు చాట్‌లు, మరో ఖాతాలో వృత్తికి సంబంధించిన సంభాషణలు జరపవచ్చు. అయితే ప్రస్తుతం వాట్సాప్‌ బీటా యూజర్లకు మాత్రమే ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిందని వాట్సాప్‌ తెలిపింది.*

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *