మే 14, 24/7 తెలుగు న్యూస్:దళితబిడ్డకు ప్రాణం పోసిన నీలిమ
రూ.20 లక్షల వైద్యం ఉచితంగా అందించిన పల్లా
బచ్చన్నపేట :
చేతిలో చిల్లి గవ్వలేదు..కనీసం హాస్పిటల్ ఖర్చులకు కూడా డబ్బులు లేవు. అయితేనేం మన రాజేశ్వర్వుడు న్నాడు కధా అనే ధీమా వారిలో ఉంది. మెదడుకు సంబంధించిన వ్యాధితో జనగామ నియోజవర్గ పరిధి బచ్చన్నపేట గ్రామానికి చెందిన ఓ నిరుపేద దళిత బిడ్డ కొన్నేళ్లుగా బాధ పడుతున్నాడు. విషయాన్ని స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాడు. వివరాలు తెలుసుకున్న పల్లా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే బాధితుడిని నీలిమ హాస్పిటల్ తీసుకెళ్లమని పురమాయించారు. సమాచారం అందుకున్న సిబ్బంది ఆ దళిత బిడ్డకు అన్ని రకాల పరీక్షలను ఉచితంగా చేశారు. దాదాపు రూ.20 లక్షల ఖర్చు అయ్యే బ్రెయిన్ సర్జరీని నీలిమ హాస్పిటల్ వైద్యులు ఉచితంగా అందజేశారు. దీంతో బాధిత కుటుంబం ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్యే సార్ ఆ రాజరాజేశ్వ రుడి లెక్క ఆదుకున్నాడని, వారికి తమ కుటుంబం రుణపడి ఉంటామని తెలిపారు.