మంచిర్యాల జిల్లా.
బెల్లంపల్లి మైనారిటీ గురుకులలో యోగపై అవగాహన కార్యక్రమం.
ఈ రోజు యోగ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా బెల్లంపల్లి లోని తెలంగాణ రాష్ట్ర గురుకుల మైనారిటీ స్కూల్ అండ్ కాలేజ్ లో కామన్ యోగ ప్రోటోకాల్ కార్యక్రమాన్ని బెల్లంపల్లి ఆయుర్వేద డాక్టర్ సంజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నిర్వహిచడం జరిగింది. డాక్టర్ విద్యార్థినులకు ఆరోగ్య విషయాలపై అవగాహన కల్పించి నిత్య జీవితంలో యోగ యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు.. ఆ తర్వాత యోగ ఇన్స్ట్రక్టర్స్ పిల్లలకు యోగ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు తెలియజేసి,వారి చేత సూక్ష్మ వ్యాయామాలు,కొన్ని ఆసనాలు, ప్రాణాయామలు,ధ్యానము చేపించడం జరిగింది.నిత్య జీవితంలో యోగ చేయడం వల్ల శరీరాన్ని దృఢంగా చేసుకోవడమే కాకుండా, మానసికంగా స్వస్థత ను పొందవచ్చు అని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ప్రభుత్వ యునాని డిస్పెన్సరీ డాక్టర్ సంజయ్ కుమార్,ఫార్మసిస్ట్ శ్రీధర్ ప్రభుత్వ ఆయుర్వేద డిస్పెన్సరీ, పర్మసిస్ట్ భూపతి,మైనారిటీ గురుకుల కాలేజీ అండ్ స్కూల్ ప్రిన్సిపల్ నీలు ,ఉపాధ్యాయులు, దేవపూర్ యోగ ఇన్స్ట్రక్టర్ నాగార్జున,బెల్లంపల్లి యోగ ఇన్స్ట్రక్టర్ వెంకటరమణమ్మ మరియు స్కూల్ సిబ్బంది పాల్గొనడం జరిగింది.
