రాష్ట్ర ప్రభుత్వం వీఆర్ఏల క్రమబద్ధీకరణలో అత్యుత్సాహం చూపిస్తూ అర్థరాత్రి ఆర్డర్ కాపీలను పంపిణీ చేయడానికి తీవ్రంగా ఖండిస్తున్నామని ఓటబందీ వీఆర్ఏల రాష్ట్ర ఉపాధ్యక్షులు చందా రాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్ఏల వ్యవస్థను రద్దుచేసి ఇతర శాఖలకు బదులాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై రాష్ట్ర హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి 81, 85 జీవోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి ఈ జీవోలు జారీ చేయక ముందుకు ఏ విధంగా వీఆర్ఏ వ్యవస్థ కొనసాగుతుందో అదే పాత పద్ధతిలో కొనసాగించాలని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. కోర్టు తీర్పును చూసి ప్రభుత్వం హుటాహుటిన రెవిన్యూ అధికారులకు ఆదేశాలు జారీ చేసి గురువారం అర్ధరాత్రి వరకు తహసిల్దార్ కార్యాలయాల్లో ఆయా గ్రామాల అసల్దారు వీఆర్ఏలకు ఆర్డర్ కాపీలు అందజేశారు. కోర్టు ఉత్తరాలను కూడా బెకాతరు చేస్తూ రాత్రికి రాత్రే 9వ తేదీ వెంటనే కలెక్టర్ కార్యాలయానికి వెళ్లి బదలాయించిన స్థానంలో ఉద్యోగంలో జాయిన్ కావాలని చెప్పడం సరైన పద్ధతి కాదన్నారు 23 వేల మంది కోసం ఐదు లక్షల మంది ఓట బందీ వీఆర్ఏలకు ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
