.అంగన్‌వాడీ లో అక్షరాభ్యాసం
-మర్కుక్
పౌష్టికాహారంతో ఆరోగ్యంగా ఉంటామని,చిన్నారులు
గర్భిణులు, బాలింతలు, పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలని మర్కుక్ సర్పంచ్ అచ్చంగారి భాస్కర్ సూచించారు. బుధవారం మండల కేంద్రమైన మర్కుక్ అంగన్‌వాడీ.2 కేంద్రంలో పిల్లలకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు,సూచనలను ఎప్పటికప్పుడు అంగన్‌వాడీ టీచర్లు, ఎఎన్ఎమ్ లు ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్ అరుణమ్మ, జయమ్మ అంగన్ వాడీ ఆయాలు, లావణ్య, బాలమణి, తదితరులు న్నారు.
