మంచిర్యాల జిల్లా.
వినాయక చవితి సందర్భంగా అధికారులతో మంచిర్యాల ఎమ్మెల్యే సమీక్ష సమావేశం.
వినాయక చవితి సందర్బంగా మంచిర్యాల నియోజకవర్గంలోని గణేష్ మండపాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు సంబంధిత అధికారులకు సూచించారు. గణేష్ చతుర్థి మొదలుకొని నిమజ్జనం వరకు మండపాల వద్ద గస్తీ ఉండాలన్నారు. కరెంట్ కేబుల్స్ కింద ఉండే మండపాల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు చేయడం జరిగింది. శానిటేషన్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఎప్పటికప్పుడు పట్టణాన్ని శుభ్రంగా ఉంచాలన్నారు. అగ్నిపమాపక సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో పొలిసు శాఖ, విద్యుత్తు శాఖ, అగ్నిమాపక శాఖ, మున్సిపల్ శాఖ, రెవెన్యూ శాఖ మరియు అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.





