*అడిషనల్ డీసీపీ అడ్మిన్ ఎస్. మహేందర్ బదిలీపై మెదక్ జిల్లా అడిషనల్ ఎస్పీగా బదిలీ అయినందున పోలీస్ కన్వెన్షన్ సెంటర్లో మా ఆత్మీయ వీడ్కోల సమావేశం నిర్వహించడం జరిగింది*
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ మేడమ్ గారు పోలీస్ అధికారులతో కలిసి మహేందర్ గారిని ఘనంగా సన్మానించి మెమొంటో అందజేశారు.
*ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మేడమ్ గారు మాట్లాడుతూ* మహేందర్ అడిషనల్ డీసీపీ గారు సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ ఏసీపీగా అడిషనల్ డీసీపీ అడ్మిన్ గా సుదీర్ఘంగా పనిచేసే ప్రజల మరియు పోలీస్ అధికారుల సిబ్బంది మన్ననలు పొందాలని కొనియాడారు, డిపార్ట్మెంట్లో క్రమశిక్షణకు మారుపేరుగా ఏ విధులు నిర్వహించిన ప్రత్యేకత చాటుకునే వారిని మరియు చెప్పిన విధులను క్రమశిక్షణ సమయస్ఫూర్తితో పూర్తి చేయడంలో దిట్ట అని తెలిపారు. ఏదైనా సమస్యల గురించి ప్రజలు వచ్చినప్పుడు వారి సమస్యలు పూర్తిగా విని కింది అధికారులకు గైడ్ చేస్తూ ప్రజల సమస్యలను త్వరగా తీర్చే విధంగా చర్యలు తీసుకునే వారన్నారు. క్రమశిక్షణ, మంచితనం మానవత్వం నీతి నిజాయితీ నిర్వహించే ప్రతి ఒక్కరిని ప్రజలు ఎల్లవేళలా గుర్తుకొంచుకుంటారని కొనియాడారు. శాంతం ఓర్పుకు మారుపేరుగా నిలిచారని, విధినిర్వహణలో నిక్కజంగా ఉండేవారని, కొనియాడారు. పోలీస్ రిక్రూట్మెంట్ లో భాగంగా అభ్యర్థుల ఈవెంట్స్ జరిగే సమయంలో మరియు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సమయంలో ఎంతో సమయస్ఫూర్తితో ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేయించారని తెలిపారు. పోలీస్ అధికారులకు సిబ్బందికి సర్వీస్కు సంబంధించిన సమస్యలు ఉంటే సిపిఓ కార్యాలయ సిబ్బందితో మాట్లాడి త్వరగా పూర్తి చేయించేవారు. ఎస్ఐ, సీఐ, ఏసీపి, అడిషనల్ డీసీపీగా డిపార్ట్మెంట్ కు ఎంతో సేవ చేశారని తన అనుభవాన్ని నలుగురికి పంచుతూ విధినిర్వహణలో ఎలా ఉండాలి అనే అంశాల గురించి అధికారులకు సిబ్బందికి తరచుగా అవగాహన కల్పించే వారిని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో పేరు తెచ్చుకున్న విధంగా మెదక్ జిల్లాలో కూడా మంచి పేరు తెచ్చుకోవాలని
సూచించారు.
ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ మహేందర్ గారితో సాహిత్యం గురించి క్రమశిక్షణ గురించి కొనియాడారు.
*ఈ సందర్భంగా అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్ గారు మాట్లాడుతూ* సిద్దిపేట జిల్లాలో సుదీర్ఘంగా పనిచేయడం ఒక మంచి అనుభవమని జిల్లాను విడిచిపెట్టి పోవడం బాధగా ఉందని బదిలీ తప్పనిసరి కాబట్టి వెళ్ళవలసి వస్తుందని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో పనిచేయడం ఒక గొప్ప అనుభూతి అనుభవాన్ని ఇచ్చిందని మంచి ఆహ్లాదకరమైన వాతావరణం సిద్దిపేట జిల్లా ప్రజలు కల్మషం లేని మనస్తత్వం గలవారిని ఏదైనా లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చినప్పుడు పోలీసులకు సహకరించి సమస్య పరిష్కరించే విధంగా సహకరించడం చాలా గొప్ప గుణమని తెలిపారు.తను పనిచేసిన ప్రతి అధికారి వద్ద క్రమశిక్షణ తో పని చేయడం జరిగిందని తెలిపారు. నా విధి నిర్వహణలో సహకరించిన పోలీస్ అధికారులకు సిబ్బందికి ప్రత్యేకంగా పోలీస్ కమిషనర్ మేడమ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మేడమ్ గారి ఆధ్వర్యంలో విధులు నిర్వహించిన రోజులు ఉల్లాసంగా ఉత్సాహంగా 19 నెలలు గడిచిపోయాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ డీసీపీలు రామచంద్రరావు, సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు సురేందర్ రెడ్డి, రమేష్, చంద్రశేఖర్, రవీందర్ రాజు,
ఎస్బి ఇన్స్పెక్టర్ రఘుపతి రెడ్డి, ఏఓ యాదమ్మ, సూపరిండెంట్స్ ఎస్.కె జమీల్ అలీ, మహమ్మద్ అబ్దుల్ ఆజాద్, మహమ్మద్ ఫయాజుద్దీన్,సీఐలు ఎస్ఐలు పోలీస్ సిబ్బంది సిపిఓ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
