– కంట్రోల్ రూం మొబైల్ నెంబర్ 93986 84240
– అత్యవసరం సహాయం కావాల్సిన వారు వెంటనే సంప్రదించాలి
– జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ..
రాజన్న సిరిసిల్ల జిల్లా లో భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కంట్రోల్ రూం లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం తెరిచిందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు. వర్షాల వల్ల ఎవరైనా ఇబ్బందులు ఎదుర్కొన్న, అత్యవసర సహాయం కావల్సిన, ఏదైనా సమాచారం ఇవ్వాల్సి ఉన్న వెంటనే కంట్రోల్ రూం నెంబర్
93986 84240 కు
ఫోన్ చేసి తెలుపాలని జిల్లా కలెక్టర్ కోరారు .ఈ అవకాశం ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి కోరారు.





