*తండ్రి గొంతు కోసిన కూతురు*
హైదరాబాద్:జులై 30
అంబర్ పేట్‌లో దారుణ ఘటన శనివారం రాత్రి చోటు చేసుకుంది. కంటికి రెప్పలా కాపాడే తండ్రిపైనే ఓ యువతి కిరాతకానికి ఒడిగట్టింది. వివరాల ప్రకారం.. అంబర్ పేట్‌లో నివసిస్తోన్న జగదీష్ అనే వ్యక్తి ఏదో విషయంలో కూతురు నిఖితను మందలించాడు.
దీంతో తండ్రిపై కోపం పెంచుకున్న నిఖిత.. తండ్రిపై దాడి చేసి గొంతు కోసింది. గమనించిన కుటుంబ సభ్యులు జగదీష్‌ను ఆసుపత్రిగా తరలించారు. చికిత్స పొందుతూ జగదీష్ ఆదివారం మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని.. నిఖితను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…
