*పెద్దపెల్లి జిల్లాలో హార్ట్ స్ట్రోక్ తో హెడ్ కానిస్టేబుల్ మృతి*
పెద్దపెల్లి జిల్లా:జులై 30
గోదావరిఖనిలోని ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీ లో నివాసం ఉంటున్న బోయోజు సోమరాజు హెడ్ కానిస్టేబుల్ ప్రస్తుతం 8 ఇంక్లైన్ కాలనీ పోలీస్ స్టేషన్లో సోమరాజు విధులు నిర్వహిస్తున్నాడు.
సోమరాజు శనివారం రాత్రి ఇంటి వద్ద మెట్లు దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి పడటంతో గోదావరిఖని ఆసుపత్రికి తరలించగా హార్ట్ స్ట్రోక్ తో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
ఎన్టిపిసి ఏఎస్ఐ చక్రపాణి వివరాలు సేకరించి కేసు దర్యాప్తు చేస్తున్నారు…..
