పల్లేర్లు మొలసిన నేలపై గంగమ్మ పరవళ్ళు
*నేడు దేవరకద్ర నియోజకవర్గంలో పొంగిపొర్లుతున్న చెరువులు,చెక్ డ్యాంలు.*
*నిండుగా ప్రవహిస్తున్న పెద్దవాగు,ఊకచెట్టువాగులు.*
*భూగర్భంలో వందల టీఎంసీల నీరును సృష్టించిన ఆలన్న.*
*సంబరంలో దేవరకద్ర రైతాంగం*
నీరు ప్రాథమికహక్కు.
సకలజీవరాసులకు నీరు అవసరం.
నీరు అందివ్వడం పాలకుల బాద్యత.
అది రాజ్యాంగహక్కు.
వలసపాలనలో పాలమూరు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
రెండు జీవనదులున్నా దేవరకద్రను ఎడారిగా మార్చారు.
దేవరకద్రలో శాశ్వతకరువు విలయతాండవమాడేది.
కరువుతో,ఆకలిచావులతో జనం అల్లాడిపోయేవారు.
తెలంగాణ ఏర్పడ్డాక ,మన ఆలన్న ఎంఎల్ఏ అయ్యాక మన దేవరకద్ర స్వరూపమే పూర్తిగా మారిపోయింది.
మన దేవరకద్ర పసిడిపంటలకు నిలయమైంది.
సిఎం కేసిఆర్ గారి ఆశీర్వాదంతో సాగునీటి విషయంలో ఆలన్న అద్భుతాలు సృష్టించారు.
భగీరథుడు స్వర్గంలో ఉన్న గంగను భువికి తెచ్చాడోలేదోకానీ…
మా ఆలన్నమాత్రం దేవరకద్ర బీడుభూములకు నీళ్ళుతెచ్చాడు.
వాగుల్లోవంకల్లో వృధాగాపోతున్న నీటిపై కట్టలు(చెక్ డ్యాంలు)కట్టి పంటపొలాలకు నీరందించాడు.
కరువునేలను దాన్యభాండాగారంగా మార్చాడు.
వలసలకు నిలయమైన మన దెవరకద్రకే వలసవస్తున్నారు.
ఇది మన ఆలన్న సాధించిన ఘనత.
చెక్ డ్యాంల నిర్మాణంలో ఆలన్న సాధించిన విజయాలకు జాతీయస్థాయిలో ప్రశంశలు లభించాయి.
కేంధ్ర సంస్థలు ఆలన్నను అభినందించాయి.
మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మన సిఎం కేసిఆర్ గారి నుండి ఆలన్న అభినందనలు అందుకోవడం దేవరకద్రవాసులుగా మనకు గర్వకారణం.
*నిజాలు మాట్లాడుకుందాం.*
—————————————-
దేవరకద్ర నియోజకవర్గం: శోధిస్తూ,సాధిస్తూ తననుతాను ప్రశ్నించుకుంటూ,ప్రజలకు మేలుజరిగే మార్గాలను అన్వేషిస్తూ సాగుతున్న అలుపెరుగని బాటసారి దేవరకద్ర శాసన సభ్యులు మా ఆలన్న.
ప్రతికూల పరిస్థితులను అధిగమించి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్న ఆదర్శనాయకుడు మా ఆలన్న.
ప్రజల వ్యక్తిగత అవసరాలను తీరుస్తూనే,వర్తమాన,భవిష్యత్తరాలకు అవసరమయ్యే మౌళిక వసతులు కల్పిస్తున్నాడు.
మా ఆలన్న శ్రమించేనాయకుడు, జ్ఞానమున్న నాయకుడు.
శ్రమ, జ్ఞానం కలిస్తే అద్భుతాలు సృష్టించొచ్చు.
అది ఈరోజు దేవరకద్ర నియోజకవర్గంలో నిర్ద్వంద్వంగా నిరూపించబడుతుంది.
ఆనకట్టలు ఆధునిక దేవాలయాలు అని నమ్మే నాయకుడు మా ఆలన్న.
ఉన్నతమైన ఆలోచనలు ఆకాశంనుండి ఊడిపడవు.
ఆలన్నలాంటి ఉన్నతమైన నాయకుల మదిలోనుండే ఉద్భవిస్తాయి.
అట్లా ఆలన్న మదిలోనుండి పుట్టిందే కోయిల్ సాగర్ గ్రావిటీ కాలువ.
ఎలాంటి నిర్మాణంలేకుండా బ్యాక్ వాటర్ నుండి కేవలం గ్రావిటీ కాలువద్వారా పదకొండుగ్రామాల పంటపొలాలకు నీళ్ళివ్వొచ్చని తన ఇంజనీరింగ్ జ్ఞానంద్వారా తెలుసుకున్నాడు.
అక్కడ కాలువతీయాలని ఆయనను ఎవరూ కోరలేదు.
ప్రజలకు మేలు చేయాలనే తపన ఉన్నవాడు కనుక తానే వెంటపడి ప్రభుత్వంచేత నిధులు మంజూరు చేయించి పనులు పూర్తి చేయిస్తున్నారు.
అది ఉపయోగంలోకి వచ్చి దేవరకద్ర,చౌదరిపల్లి,బస్వాయిపల్లి,జీనుగురాల,డోకూర్,గోపన్ పల్లి,కౌకుంట్ల,పేరూరు,రేకులంపల్లి తదితర గ్రామాల బీడు భూములకు నీరందిస్తుంది.
అధికారుల బుర్రకు కూడా తట్టని అద్భుతమైన ఆలోచన ఇది.
కెఎల్ఐ ఆయకట్టులోలేని మన భూములకు తన పట్టుదలతో నీళ్ళిప్పించిన అపరభగీరథుడు మన ఆలన్న.
కెఎల్ఐ కాలువను కందూరువాగులో కలిపి మూసాపేట అడ్డాకుల మండలాల భూములకు సాగునీరందిస్తున్నాడు.
గతపాలకుల పాపం దేవరకద్రను అదఃపాతాళానికి తోసేసింది.
ఆకలి,అసమానత,వలసలు,వలసచావుల కూపంలోకి ప్రజానీకాన్ని నెట్టేసింది.
తల్లికి పిల్లకి నోచుకోక జీవిగంజికోసం దిక్కులేని పక్షుల్లా తలోదిక్కుకు ఎగిరిపోయేవారు.
ఇన్ని సవాళ్ళమద్య ఆలన్న నియోజకవర్గంలో ఎంఎల్ఏగా అడుగుపెట్టాడు.
కొత్తగావచ్చిన యువనాయకుడు కాబట్టి ఒంటరిగా ప్రకృతితో యుద్దమేచేశాడు.
జనంబాధను తన బాధగా భావించాడు.
తన ఇంజనీర్ జ్ఞానానికి పదునుపెట్టాడు.
వాగుల్లోవంకల్లో వృధాగా పోతున్న నీటిపై చెక్ డ్యాములై నిలిచాడు. ఒక నిబద్దతగల నీరడిలా తూములనుండి బీడుభూములపై వరదనీరై ప్రవహిస్తున్నాడు.ఉబికివచ్చే భూగర్భజలమై జనంచేత నీరాజనాలు అందుకుంటున్నాడు.దేవరకద్ర సాగునీటి ఘనతను డిల్లీవరకు చాటాడు.
వలసగ్రామాలకే వలసలువచ్చే స్థాయికి మన నియోజకవర్గాన్ని చేర్చాడు.
వలసలు ఆగిపోయాయి.
వలసచావులు అంతరించాయి.
పండుగపబ్బాలతో,దాన్యరాసులతో ఊళ్ళు సంబురపడుతున్నాయి.
ఆకలి అన్నపదం నిఘంటువుల్లో దాగిపోయింది.
మేము ఈరోజు నిజాలు మాట్లాడుతున్నాము.
అబద్దాలు,అభూతకల్పనలు చెప్పడంలేదు.
మా నాయకుడు ఆలన్న చేసిన అభివృద్ధిని చెబుతున్నాం.
మిషన్ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల్లో పూడికతీయించడం,కట్టలు మరమ్మతులు చేయించడం,చెరువులు,కుంటలను కృష్ణాజలాలతో నింపడంతో అడుగంటిపోయిన భూగర్భజలాలు పైపైకి వస్తున్నాయి. చెక్ డ్యాంల పక్కన చాలా కాలంగా పాడుబడిన బావులు నేడు నిండు కుండలా దర్శనమిస్తున్నాయి.కొన్ని చోట్ల మోటార్లు పెట్ట కుండానే నీళ్లు ఉబికి వస్తున్నాయి.
ఇదంతా మా ఆలన్న సాధించిన విజయం.
మండుటెండల్లోసైతం ఉబికివస్తున్న ఊటనీరు సాక్షిగా మా ఆలన్న నిజంగా భగీరథుడే.
చేయగలిగినంతా చేశాడు.
ఇంకా చేయవలిసింది మిగిలే ఉంది.
మిగిలిన పనులు పూర్తికావాలంటే ఆలన్నే మన నాయకుడిగా ఉండాలి.
తప్పకుండా ఉంటాడు
