Breaking News

ట్రాఫిక్ బూత్లో మద్యం తాగుతున్న వీడియో వైరల్*

111 Views

*????ట్రాఫిక్ బూత్లో మద్యం తాగుతున్న వీడియో వైరల్*

 

ట్రాఫిక్ జంక్షన్లలో ఏర్పాటు చేసిన బూతు లో పోకిరీలు కూర్చొని మద్యం తాగుతూ బిర్యానీ తింటున్న వీడియో వైరల్ గా మారింది. ఈ ఘటన మాదాపూర్ లోని హైటెక్ సిటీ జంక్షన్ శని వారం రాత్రి చోటుచేసుకుంది. జంక్షన్ లో ఏర్పాటు చేసిన బూత్ లో ట్రాఫిక్ పోలీసులు కూర్చొని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడం, సిగ్నల్స్ ను కంట్రోల్ చేయడం చేస్తుంటారు. కానీ ఇక్కడ ఇద్దరు పోకిరీలు మందు కొట్టడానికి అడ్డాగా మార్చు కున్నారు. ఆయా ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలున్నా అవి కమాండ్ కంట్రోల్ సెంటర్లకు అనుసంధానం చేసి ఉన్నా పోలీసులు ఎవరూ గుర్తించలేదు. కానీ ఇది గమనించిన కొంతమంది మందు బాబుల వీడియో తీసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *