హైదరాబాద్ మార్చి 14, తెలుగు న్యూస్ 24/7: ప్రభుత్వ ఉపాద్యాయ, ఉద్యోగులకు సంబంధించిన జి ఓ 317 , జి ఓ 46 లపై ఏర్పాటు చేసిన మంత్రి వర్గ ఉపసంఘం గురువారం సచివాలయంలో వివిధ సంఘాలతో సమావేశం అయ్యింది.
రాష్ట్ర వైద్య ఆరోగ్య , కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి దామోదర రాజ నరసింహ అధ్యక్షతన, మంత్రి వర్గ సభ్యులు, మంత్రి శ్రీధర్ బాబు, కమిటీ అధికారులు అయిన పిఆర్సి చైర్మన్ శివ శంకర్, హోమ్ శాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, సెక్రటేరియట్ సర్వీసెస్ కార్యదర్శి నిర్మల, విద్యా శాఖ డైరెక్టర్ శ్రీదేవ సేన, న్యాయ శాఖ కార్యదర్శి తిరుపతి, ప్రూఫ్ . కోదండరామ్ వివిధ శాఖల ఉన్నతాధికారులు కమిటీ సమావేశంలో పాల్గొన్నారు.
317 జీవో & జీవో 46 లకు సంబంధించి అన్ని ఉద్యోగ సంఘాల నుండి విజ్ఞాపనలు, సలహాలు, సూచనలు స్వీకరించారు.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు శాపంగా మారిన ఆ జీవోలను రద్దు చేయాలని మంత్రి వర్గ ఉప సంఘానికి విజ్ఞప్తి చేశాయి.
ఉద్యోగుల స్థానికత ఆధారంగా, జోన్ల వారీగా బదిలీలు చేపట్టాలని ఉద్యోగ సంఘాలు విన్నవించాయి.
మంత్రులు సుదీర్ఘంగా ఆయా ఉద్యోగ సంఘాలు సమర్పించిన విజ్ఞాపనలు, సలహాలు, సూచనలు స్వీకరించారు. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు కమిటీ పరిశీలించి, అధ్యయనం చేసి తగు నివేదికలను సిద్దం చేసి గౌరవ ముఖ్యమంత్రికి సమర్పిస్తామని తెలిపారు. సానుకూల పరిష్కారానికి, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సమావేశంలో జీవో 317 బాధిత ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘం, పిఆర్టియుపి ఆర్ టి యు తెలంగాణ ,టీజీవో , టీజీ జీవో , టిఆర్ఎస్ , ఆర్ఎస్ ఎస్సీ ఎస్టీ , ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం, పి ఆర్ టి యు, ఎస్ టి ఎఫ్ పి ఆర్ టి యు , గౌట్ ఎస్ టి ఎఫ్ . లెక్చరర్స్ అసోసియేషన్ , వివిధ ఉద్యోగ, ఉపాద్యాయ సంఘాలు పాల్గొన్నాయి.