అప్పుల బాధతో ఒకరిఆత్మహత్య. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని నారాయణపూర్ గ్రామానికి చెందిన శివరాత్రి రాజయ్య 55 అప్పుల బాధతో శనివారం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది గత కొంతకాలంగా ట్రాక్టర్ కొనుగోలు చేసి పని సరిగా దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా ఇటీవల ఒక బొలెరో వాహనాన్ని కూడా ఫైనాన్స్లో లో కొనుగోలు చేయడం జరిగింది వాహనాలకు పని సరిగా దొరకకపోవడంతో అటు కిస్తీలు కట్టలేక కుమార్తె వివాహం అప్పులు కూడా పెరిగిపోవడంతో మనసు విరక్తి చెంది ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని కుమారుడు రాజశేఖర్ తెలిపారు మృతుని భార్య మల్లవ్వ గత కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతుంది మృతిని కుటుంబాన్ని ఆదుకోవాలని ఎంపిటిసి అపేరా సుల్తానా ఉపసర్పంచ్ మహేందర్ మాజీ సర్పంచ్ దొమ్మాటి నరసయ్యలు ప్రభుత్వాన్ని కోరారు సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ తెలిపారు
