దీక్ష శిబిరాన్ని ఎత్తివేయడం పట్ల నిరసన. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ఆమరణ నిరాహార దీక్ష కాంగ్రెస్ శిబిరాన్ని ఎత్తివేయడం పట్ల సోమవారం ఎల్లారెడ్డిపేట మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య నిరసన వ్యక్తం చేశారు ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష శిబిరాన్ని ఆదివారం రాత్రి పోలీసులు బలవంతంగా ఎత్తివేయడం పట్ల తీవ్రంగా నిరసన వ్యక్తం చేశారు ప్రజా సమస్యల కోసం రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రకారంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తే పోలీసులు దౌర్జన్యంగా వారిని ఆసుపత్రిలో చేర్పించడం అన్యాయం అన్నారు ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ ముస్తాబాద్ ఎల్లారెడ్డిపేట మండలాలలో మంత్రి ఇచ్చిన హామీ ప్రకారంగా 30 పడకల ఆస్పత్రులు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు వెంటనే మంజూరు చేయాలని డిమాండ్ చేశారు ఈ సమావేశంలో జిల్లా ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు
