ఎర్రవల్లి గ్రామానికి చెందిన హై మొండి సాయిలు కుమారుడు సంపత్ (23)కు దరాబాదులో పని ముగించుకొని ఇంటికి వస్తుండగా యాక్సిడెంట్ అయింది. హైదరాబాద్ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మర్కుక్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు (ఎంపీపీ) పాండు గౌడ్ జెడ్పీటీసీ మంగమ్మ రాంచంద్రం బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి వైఎస్ ఎంపీపీ బాల్ రెడ్డి స్థానిక సర్పంచ్ భాగ్య బిక్షపతితో కలిసి మృతుని కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం తక్షణ సాయంగా 18000 రూపాయల ఆర్థిక సాయం వారి కుటుంబ సభ్యులకు వెళ్లింది. వారితో పాటు జగదేవపూర్ ఫ్యాక్స్ వైస్ చైర్మన్ కమ్మరి బాల్ రాజు ఉప సర్పంచ్ కనకయ్య ఎంపీటీసీ ధనలక్ష్మి కృష్ణ వార్డు సభ్యులు శ్రీశైలం యాదగిరి బిఆర్ఎస్ నాయకులు చిన్న రెడ్డి పరశురాములు ఉన్నారు*.





