బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎల్లారెడ్డిపేట సర్పంచ్ పై తీవ్ర విమర్శలు
రాజన్నసిరిసిల్ల జిల్లా లో వాయిస్ రికార్డింగ్ వైరల్
సిరిసిల్ల ఎస్పీకి ఫిర్యాదు చేసిన గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్
రాజన్నసిరిసిల్ల:
రాజన్న సిరిసిల్ల జిల్లా లో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు చిదురు గోవర్థన్ గౌడ్ మాట్లాడిన ఆడియో రికార్డింగ్ వైరల్గా మారింది. కుల సంఘం వాట్సప్ గ్రూపులో తీవ్రమైన పదజాలంతో బూతుపురాణం అందుకున్నాడు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య వల్లే మంత్రి కేటీఆర్కు సిరిసిల్ల నియోజకవర్గంలో నష్టం కలుగుతుందన్నారు. ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డికి నెలకు రెండు మూడు సార్లు మంత్రి కేటీఆర్ అపాయింట్మెంట్ ఎలా దొరుకుతుందని, తనకు ఎందుకు దొరకడం లేదని విమర్శలు చేశారు. మంత్రి కేటీఆర్ చాలా మంచోడని.. కానీ బీఆర్ఎస్ లో మంత్రి కేటీఆర్ చుట్టు ఉన్న లీడర్లతోనే కేటీఆర్కు నష్టం కలుగుతుందని బూతులు మాట్లాడారు.సర్ధార్ సర్వాయి పాపన్న విగ్రహం తో పాటు నాలుగు ఎకరాల భూమి గౌడ సంఘంకు ఇస్తానని మంత్ర కేటీఆర్ హమీ ఇస్తే.. ఆయన్ని కలవడానికి మంత్రి కేటీఆర్ పీఏలు, తోట ఆగయ్యలు కలవనివ్వడం లేదని ఆగ్రహాం వ్యక్తం చేశారు. కేటీఆర్ను ఓడించడానికే తోట ఆగయ్య ప్రయత్నాలు చేస్తున్నడన్నారు.తోట ఆగయ్య గౌడ కులస్తును మోసం చేస్తున్నడన్నారు.బీఆర్ఎస్ పార్టీలో దళారులు ఉన్నరన్నారు. మంత్రి కేటీఆర్ మీద ఇప్పటికి నమ్మకం ఉందన్నారు. గౌడ సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ గౌడ్ను తీవ్ర స్థాయిలో బూతులు తిట్టినట్లు ఆడియోలో ఉండటంతో వెంగల శ్రీకాంత్ గౌడ్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి ఎల్లారెడ్డిపేటలో ప్రెస్ మీట్ పెట్టి గోవర్థన్ రెడ్డి మాటలను ఖండించారు. బూతులు మాట్లాడటం సరికాదున్నారు. గౌడసంఘం జిల్లా అధ్యక్షుడు గోవర్థన్ రెడ్డిపై ఎల్లారెడ్డిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు.
