డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేత
21 డిసెంబర్ , ఇల్లంతకుంట
బిజెపి రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు భారతీయ జనతా పార్టీ ఇల్లంతకుంట మండల శాఖ అధ్యక్షుడు నాగ సముద్రాల సంతోష్
ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో గల రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నాగసముద్రాల సంతోష్ మాట్లాడుతూ రాజ్యాంగ అనుసార బద్దంగా ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి దేశంలో ఉన్నతమైన స్థాయి దేశ ఉప రాష్ట్రపతిగా రాజ్యసభ చైర్మన్ గా బాధ్యతలు బాధ్యతలు నిర్వహిస్తున్న జగదీష్ ధన్కర్ ని అవహేళన చేస్తూ వ్యంగంగా శరీర సౌష్టవాన్ని అనుకరిస్తూ వ్యవహరించిన తీరును ఖండిస్తున్నామని వెంటనే తీరును మార్చుకొని రాహుల్ గాంధీ మరియు అవహేళన చేసిన ఇతర ఎంపీలు కూడ దేశ ఉపరాష్ట్రపతి ,రాజ్యసభ చైర్మన్ జగదీష్ ధన్కర్ కి క్షమాపణలు చెప్పి రాజ్యాంగ విధి విధానాలను గౌరవించి వెంటనే రాజీనామా చేయాలని, గతంలో కూడా పార్లమెంటులో రాహుల్ గాంధీ తీరుకు సస్పెండ్ అయినా కూడా యొక్క వ్యవహార శైలి మారకపోవడం సరి అయినది కాదని ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నుకోబడిన వ్యక్తిగా ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ఇట్టి కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు గజ్జల శ్రీనివాస్,బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యురాలు కొలనూరు ముత్తక్క, దళిత మోర్చా మండల అధ్యక్షుడు మామిడి శేఖర్, శక్తి కేంద్రం ఇన్చార్జులు పొన్నం కృష్ణ, సుధగోని శ్రీకాంత్, అధ్యక్షుడు మంత్రి అరుణ్, కోమటిరెడ్డి అనిల్ రెడ్డి,వెంకటేష్ లు పాల్గొన్నారు
