Breaking News

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి*  

132 Views

*జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి*

 

 

జనగామ – జిల్లా:జులై : 15.

రఘునాథపల్లి మండలం కోమల టోల్ గేట్ వద్ద శనివారం ఉదయం బొలెరో వాహనం ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. వరంగల్ పోచమ్మ మైదాన్ ప్రాంతానికి చెందిన వడ్లకొండ రాకేష్, మరో వ్యక్తి బొలెరో వాహనంలో వరంగల్ నుండి హైదరాబాద్ వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన తీరును పరిశీలిస్తే అతివేగమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తుంది. మృతులిద్దరూ సాఫ్ట్ వేర్ ఇంజనీర్లుగా తెలుస్తుంది. ఘటన స్థలానికి రఘునాథపల్లి ఎస్సై రఘుపతి చేరుకుని మృతదేహాలను జనగామ ఆసుపత్రికి తరలించారు. రాకేష్‌తో పాటు మరణించిన మరో వ్యక్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాకేష్ హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్‌గా పని చేస్తున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు…

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *