*కొమురవెల్లి మండల కేంద్రంలో జరిగిన దొంగతనం కేసులో 24 గంటల్లోపు నిందితుని అరెస్టు చేసిన చేర్యాల సర్కిల్ పోలీసులు*
నిందితుని వివరాలు*
మేడికుంట మల్లేశం తండ్రి తండ్రి రాములు వయసు 30 సంవత్సరములు గ్రామం & మండలం. జిల్లా సిద్దిపేట.
*నిందితుని వద్ద నుండి రికవరీ చేసిన వస్తువుల వివరాలు*
????32 తులాల బంగారు వస్తువులు
????23 తులాల వెండి వస్తువులు
????₹1,17,000 వేల రూపాయల నగదు
ఈ సందర్భంగా కొమురవెల్లి పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చేర్యాల సిఐ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ 22-జులై-2023 నాడు కొమురవెళ్లి గ్రామానికి చెందిన అంబడిపల్లి అర్చన ఇంట్లో దొంగతనం జరిగిందని బంగారం, వెండి, నగదు డబ్బులు గుర్తుతెలియని దొంగలు దొంగలించుకుని పోయినారని ఫిర్యాదురాలు దరఖాస్తు ఇవ్వగా కొమురవెల్లి ఎస్ఐ చంద్రమోహన్ కేసు నమోదు చేసినారు. చేర్యాల సిఐ సత్యనారాయణ రెడ్డి, ఎస్ఐ చంద్రమోహన్ కేసు పరిశోధనలో భాగంగా సీసీ కెమెరాల ఫుటేజ్, మరియు టెక్నాలజీ తో గత కొన్ని రోజుల క్రితం ఫిర్యాదురాలు ఇంట్లో ప్లంబింగ్ పనిచేసిన పై నిందితుడు వాళ్లు మాట్లాడుకున్న మాటలు వింటూ విహారయాత్రకు వెళుతున్న విషయాన్ని పసిగట్టి ఇంటికి తాళం వేసి ఉన్న విషయాన్ని చూసుకొని తేదీ 22-07-2023 మధ్యరాత్రి ఇంటిపై ఉన్న పెంట్ హౌస్ తాళం పగలగొట్టి పై బంగారు వెండి నగదు డబ్బులు దొంగలించుకుని పోయినాడు.
ఈరోజు సోమవారం ఉదయం కొండపాక మండలం తిమ్మారెడ్డి పల్లి గ్రామంలో పై నిందితుడు ఉన్నట్లు నమ్మదగిన సమాచారం పై వెళ్లి అదుపులోకి తీసుకుని విచారించగా దొంగతనం చేసిన విషయం ఒప్పుకొని దొంగలించిన పై బంగారు, వెండి, నగలు, మరియు నగదు రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేసు పరిశోధనలో భాగంగా పై నిందితున్ని మరింత లోతుగా విచారించి అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు పంపించడం జరుగుతుందని చేర్యాల సిఐ తెలిపారు.
సీఐ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ చేర్యాల సర్కిల్ పరిధిలోని గ్రామాలలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని,ఇళ్ళలో పనులు జరుగుతున్న సమయంలో ఎవరిని నమ్మరాదని, వారి వద్ద ఎలాంటి కుటుంబ విషయాలు మాట్లాడుకోవద్దని, వారిని నమ్మి ఎక్కడికి పోవద్దని సూచించారు. ఏదైనా పని చేయించేటప్పుడు పని పూర్తయ్యేంతవరకు ఇంటి యజమానులు వారి వెంట ఉండాలని తెలిపారు. ఎవరికైనా ఎలాంటి అనుమానం కలిగిన వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని లేదా డయల్ 100 కు ఫోన్ చేసి తెలపాలని సూచించారు.
24 గంటల్లో కేసును చేదించడం జరిగిందని కొమురవెల్లి ఎస్ఐ చంద్రమోహన్, సిబ్బంది కేసు చేదనలో కీలకపాత్ర వహించారని అభినందించారు. త్వరలో రివార్డు గురించి ఉన్నతాధికారులకు ప్రపోజల్ పంపిస్తామని తెలిపారు





