*రామగుండం పోలీస్ కమీషనరేట్*
ప్రజలతో మమేకమై ఓటర్లకు సహాయ పోలింగ్ కేంద్రాలలో పోలీసుల మానవీయత ప్రశంసనీయం
రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలో రెండో విడుత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలీసుల మానవీయత ప్రశంసనీయంగా నిలిచింది. పోలింగ్ కేంద్రాలకు వచ్చిన వృద్ధులు, మహిళలు, ప్రత్యేక అవసరాలున్న ఓటర్లకు పోలీసులు సహాయం అందించారు. పోలింగ్ కేంద్రాల్లో భద్రతతో పాటు ఓటర్లకు అవసరమైన మార్గనిర్దేశం, భరోసా కల్పిస్తూ చేయూతనందించి వారు సురక్షితంగా ఓటు వినియోగించకునేందుకు పూర్తి సహకారం అందించారు. పోలీసులు ప్రజలతో మమేకమయ్యారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా శాంతియుత వాతావరణంలో పోలింగ్ కొనసాగేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ప్రజలు స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే లక్ష్యంతో పోలీసులు నిరంతరం విధులు నిర్వర్తిస్తూ మానవత్వం ప్రదర్శించారు.





