బిఎస్పీ గజ్వెల్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిగా కనుగుల రమణాకర్ , కోశాధికారిగా MD. అఖిల్ పాషా నియామకం
బహుజన్ సమాజ్ పార్టీ గజ్వెల్ నియోజకవర్గ అధ్యక్షులు గూడూరి కరుణాకర్ గారి అధ్యక్షతన సమావేశం నిర్వహించి నూతనంగా పార్టీలో చేరిన BC ,మైనారిటీ నాయకులకు పదవి బాధ్యతలు ఇవ్వడం జరిగింది అధ్యక్షులు మాట్లాడుతూ గజ్వెల్ లో BRS పార్టీ దీటుగా BSP బలోపేతం అవుతుందని అన్నారు. ముఖ్య అథిధులుజిల్లా ఉపాధ్యక్షులు కాటికెలా ఓo ప్రకాష్ గారు మాట్లాడుతూ బహుజనులకు రాజ్యాధికారం బహుజన్ సమాజ్ పార్టీ ద్వారా మాత్రమే వస్తుందని, గజ్వేల్ లో BC ST, SC మైనారిటీ లు చైతన్యం అవుతున్నారని,BRS, BJP పార్టీలకు ఖచ్చితంగా బహుజనులు బుద్ధి చెప్తారని అన్నారు.అలాగే జిల్లా కార్యదర్శి కొండనొల్ల నరేష్ గారు మాట్లాడుతూ బహుజనులు సొంత గూడు BSP కి చేరుతున్నారని,మణిపూర్ లో గిరిజనుల పై జరిగిన అమానవీయ ఘటనకు మోడీ క్షమాపణలు చెప్పాలని అన్నారు. అదేవిదంగా ఈ సమావేశంలో నియోజకవర్గ ఉపాధ్యక్షులు గుర్రం ఎల్లం గారు ,కోశాధికారి గారి మొండి కరుణాకర్ గారు ,నియోజకవర్గ EC మెంబెర్ గా జోడిమూతుల నవీన్ గారు , గజ్వెల్ పట్టన అధ్యక్షులు కొలుపుల స్వామి గారు , జగదేవపూర్ మండల్ అధ్యక్షులు కర్రే అశోక్ గారు ,మార్కుక్ మండల్ అధ్యక్షులు బాబు గారు ,BVF నాయకులూ జిల్లా కన్వీనర్ శ్రీశైలం గారు ,BVF కో కన్వీనర్ నాగరాజ్ గారు ,నియోజకవర్గ BVF నాయకులు అనిల్ గారు ,BTCEEL నియోజకవర్గ అధ్యక్షులు గణేష్ గారు ,రవీందర్,వంశీ ,అరుణ్ , స్వామి, సునీల్ మరియు సెక్టార్, బూత్ స్థాయి నాయకులు పాలుగొనడం జరిగింది .
