తెలుగు 24/7 న్యూస్ (తొర్రూరు ప్రతినిధి) ఏప్రిల్ 07
తొర్రూరు మండల జడ్పీటీసీ – జెడ్పి ఫ్లోర్ లీడర్ మంగళపెల్లి శ్రీనివాస్ సహచరిని ఉపాధ్యాయురాలు సబిహా భాను తండ్రి రషీద్ ఖాన్ (96) నిన్న సాయంత్రం అనారోగ్యంతో మరణించారు.
విషయం తెలుసుకున్న మాజి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ రోజు వారి స్వగ్రామైన మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట్ మున్సిపాలిటి కేంద్రంలోని వారి నివాసానికి వెళ్లి పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
వారితో కుటుంబ సభ్యులతో పాటు రాయిశెట్టి చంద్రయ్య, బిఆర్ఎస్ పార్టీ 6వ డివిజన్ అధ్యక్షులు రాయిశెట్టి వెంకన్న, పట్టణ ఉపాధ్యక్షులు రాయిశెట్టి ఉపేందర్, బోలగాని వెంకన్న రాయిశెట్టి యాకేందర్, రాయిశెట్టి రాజశేఖర్, మంగళపెల్లి మురళి, గార అనిల్ తదితరులు ఉన్నారు.
