Breaking News

హరీష్ రావు‌ను కలిసిన రాజాసింగ్.. హాట్ టాపిక్‌గా మారిన భేటీ!

106 Views

_*హరీష్ రావు‌ను కలిసిన రాజాసింగ్.. హాట్ టాపిక్‌గా మారిన భేటీ!*_

 

_హైదరాబాద్ : తెలంగాణలో రాజకీయాలు రసవతరంగా మారాయి. ఈ తరుణంలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ శుక్రవారం మంత్రి హరీష్ రావుతో భేటి అయ్యారు. ఈ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. గోషామహల్ ఎమ్మెల్యే బీజేపీ బహిష్కృత నేత రాజాసింగ్ ఏది చేసినా ఓ సంచలనమే. గత కొంతకాలంగా రాజాసింగ్ సైలెంట్‌గా ఉన్నారు. అప్పుడప్పుడు తనదైన శైలితో చేస్తున్న కామెంట్లతో వార్తల్లో నిలుస్తున్నారు._

 

_ప్రస్తుతం రాజకీయాలు వేడెక్కాయ్. ఈ తరుణంలోనే బిజెపి నేతలు కొంతమంది ఇతర పార్టీలోకి చేరుతున్నారని ప్రచారం ఉపందుకుంది. ఆ పార్టీలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నా తరుణంలోనే మంత్రి హరీష్ రావును బీజేపీ బహిష్కృత నేత, ఎమ్మెల్యే రాజాసింగ్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీలో చేరుతారా.. ఇంకేమైనా కారణాలు ఉన్నాయా… అనేది హాట్ టాపిక్‌గా మారింది._

 

_ఇప్పటికే బీజేపీకి బీఆర్ఎస్ మీటింగ్‌గా మారిందని కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో రాజాసింగ్ మంత్రి హరీష్ రావుతో భేటి కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకాలం లేనిది ఎన్నికల ముందు ఒక్కసారిగా కలవడం చర్చనీయాంశమైంది. బీజేపీ నేతలు ఇప్పటికే పార్టీని వీడుతున్నారని ప్రచారం ఊపు అందుకున్న తరుణంలో రాజాసింగ్ బీఆర్ఎస్ మంత్రితో భేటీ అటు బీజేపీ, ఇటు బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశం అయింది..

No Slide Found In Slider.

Poll not found

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *