Breaking News

రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక.*

72 Views

 

 

*- – – రోడ్డు ప్రమాదాల నివారణకై ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక.*

 

*- – – రోడ్డు ప్రమాదాల నివారణలో ప్రజలు భాగస్వామ్యం కావాలి.*

 

*- – – రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా స్థాయిలో ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో డిస్టిక్ ట్రాఫిక్ అనాలసిస్ బ్యూరో.*

 

*- – – మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమాన, జైలు తప్పదు.*

 

*- – – జిల్లా ఎస్పీ శ్రీ ఎగ్గడి భాస్కర్

జగిత్యాల జిల్లా…

ఈరోజు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో రోడ్డు ప్రమాదాల నివారణ పై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

 

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ…. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరుగుతోంది అని పోలీస్ శాఖ ఎన్ని చర్యలు చేపట్టిన ప్రజలు కుడా భాగస్వామ్యం అయితేనే ప్రమాదాలను పూర్తిగా నివారించగలమని అన్నారు. రాష్ట్ర డిజిపి గారి ఆదేశాల మేరకు జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు జిల్లా స్థాయిలో ఒక ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో డిస్టిక్ ట్రాఫిక్ అనాలసిస్ బ్యూరో ని ప్రారంభించి ఇతర శాఖల అధికారులను సమన్వయం చేసుకుంట రోడ్డు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. తరుచుగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను ఈ విభాగం పరిశీలించి రోడ్డు ప్రమాదాలకు గల కారణాలు, నివారణకు తీసుకోవాల్సిన చర్యలుపై ఈ విభాగం అధికారులు నివేధిక అందజేస్తారని, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి ప్రమాదాల నివారణ తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీస్ అధికారులను ఆదేశించారు. గత 6 నెలలుగా తీసుకుంటున్నా చర్యల వల్ల గత సంవత్సరం తో పోలిస్తే రోడ్డు ప్రమాదాలు తగ్గాయని అన్నారు. వాటినీ పూర్తిగా నివారించాల్సిన అవసరం ఉందని అందులో బాగంగా పోలీస్ కళా బృందం ద్వారా జాతీయ రహదారి పై ఉన్న అన్ని గ్రామాల్లో అవగాహాన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేవిదంగా హైవేలపై జరిగే యాక్సిడెంట్ లకు సంబంధించి ఫస్ట్ రెస్పాండర్స్ గా ఉండేందుకు హైవేలపై ఉన్న పెట్రోల్ బంక్ వారికి, ధాబాలో పనిచేసే వారికి, యూత్ ,విలేజెస్, కి ఫస్ట్ ఎయిడ్ మరియు సిపిఆర్ పై అవగాహన కలిగించాలని అధికారులకు సూచించారు. జిల్లా లో ఉన్న 55 బ్లాక్ స్పాట్స్(ప్రమాదాలు అధికముగా జరుగు ప్రదేశాలు) ను పంచాయతీ రాజ్ మరియు ఆర్&బి ప్రబుత్వ శాఖల సమన్వయంతో ప్రమాదాల నివరణ పై దృష్టి సారించాలని అన్నారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలోని ఈ రోజు నుండి రోడ్డు ప్రమాదాల నివారణకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని ఇందులో భాగంగా ర్యాస్ డ్రైవింగ్, విత్ ఔట్ నెంబర్ ప్లేట్, , డ్రంక్ అండ్ డ్రైవ్, ట్రిపుల్ రైడింగ్ వాటి పై దృష్టి సారించాలని అన్నారు.

 

*మద్యం సేవించి వాహనాలు నడిపితే జరిమాన, జైలు తప్పదు.*

 

 

*గడిచిన ఆరు నెలల్లో జిల్లా వ్యాప్తంగా 4723 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడం జరిగిందని* *మద్యం సేవించి వాహనం నడిపి ప్రమాదాలకు కారణమైన వారిపై వారిపై 304-II IPC సెక్షన్ కింద కేసులు బుక్ చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని సూచించారు.* డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వ్యక్తుల యొక్క డ్రైవింగ్ లైసెన్స్ తీసుకొని ఆ యొక్క లైసెన్స్ రద్దుకు సంబంధిత రవాణా శాఖ అధికారులకు సిఫారసు చేయాలని అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారనే లక్ష్యంగా క్రమం తప్పకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలను కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

 

*అవగాహన కార్యక్రమాలు….. కౌన్సిలింగ్ లు.*

 

 

జిల్లా లో రోడ్డు ప్రమాద నివారణ చర్యల్లో భాగంగా మరియు Traffic awareness కోసం Road Safety డిజిటల్ స్క్రీన్ కలిగిన బస్ ను జిల్లా వ్యాప్తంగా ప్రదర్శనలు ఇస్తూ, ట్రాఫిక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో స్కూల్ విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన మరియు డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వారిని వారి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తూ ప్రజలలో అవగాహన కల్పిస్తున్నాము. ఆటో స్టాండ్‌లో ఉన్న డ్రైవర్లకు నియమ నిబంధనలు వివరించడం, కళాశాలలకు వెళ్లి విద్యార్థులతో మమేకమై పాటించాల్సిన నియమాలు వివరించడం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.

 

ఈ యొక్క సమావేశంలో డిఎస్పీలు రవీంద్ర కుమార్, శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ రఫిక్ ఖాన్, మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు

Oplus_131072
Oplus_131072
ములుగు విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *