చికెన్ వండలేదని భార్యను గొడ్డలితో నరికేశాడు
తెలంగాణలోని మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేటలో షాకింగ్ ఘటన జరిగింది. గాలిపెల్లి పోశం, శంకరమ్మ భార్యాభర్తలు. చికెన్ కూర వండాలని భార్య శంకరమ్మను పోశం బుధవారం రాత్రి కోరాడు. అయితే ఆమె వంకాయ కూర వండింది. దీంతో భార్యపై కోపంతో పోశం రగిలిపోయాడు. శంకరమ్మ నిద్రిస్తున్న సమయంలో ఆమెను గొడ్డలితో కిరాతకంగా నరికి చంపాడు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
