సిద్దిపేట జిల్లా ప్రపంచం గర్వించదగ్గ మేధావి అంబేద్కర్
అమిత్ షా క్షమాపణలు చెప్పాలి
అంబేద్కర్ పై అమిత్ షా వాఖ్యలు వెనక్కితీసుకోవాలి
మాల మానాడు దౌల్తాబాద్ మండల అధ్యక్షులు బొల్లం రాజేష్.
సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ డిసెంబర్ 19
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అంబేద్కర్, అంబేద్కర్ అంటూ పదే పదే అనడం ఇప్పుడు ఓ ఫ్యాషన్‌గా మారింది…దీనికి బదులుగా దేవుడిని ఇన్నిసార్లు స్మరిస్తే.. స్వర్గానికి వెళ్లొచ్చని సాక్షాత్తు పార్లమెంట్ లో అమిత్ షా అనడం బాధాకరమన్నారు. దేశంలోనే ఉన్నతమైన పదవుల్లో ఉండి అంబేద్కర్ ను అవమానించడం సరికాదన్నారు. ప్రపంచ మేధావి అంబేద్కర్ ను అవమానించే హక్కు నీకు లేదని, అంబేద్కర్‌ను అవమానించిన అమిత్ షాను వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వలనే ఈరోజు పార్లమెంట్లో ఉన్నతమైన పదవి అనుభవిస్తున్నావని తెలిపారు. ఆ మహానుభావులు పేట్టిన బిక్షాను మర్చిపోయి నోటికొచ్చినట్లు మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు.డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ను కించపరిచి మాట్లాడినందుకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో దేశంలో అంబేద్కర్ బదులుదళిత సంఘాలు ఏకమై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
