హక్కుల కోసం నినదించిన స్వరం….. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు భారతరత్న డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ హక్కుల కోసం నినదించిన స్వరం….. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు భారతరత్న డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్
>హక్కుల కోసం నినదించిన స్వరం.. డా బి ఆర్ అంబేద్కర్* : మాజీ మంత్రివర్యులు జోగు రామన్న రాష్ట్ర మొచి సంఘం ప్రధాన కార్యదర్శి బాల శంకర్ కృష్ణ*
ఆదిలాబాద్ 14.04.2022
——————————
జగదీశ్వర్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్/ తెలంగాణ రాష్ట్రం*
*********************
ప్రజల హక్కుల కోసం నినదించి, రాజ్యాంగంలో పొందుపరచిన మహనీయుడు డా బి ఆర్ అంబేద్కర్ అని తెలంగాణ రాష్ట్ర సంఘం రాష్ట్ర కార్యదర్శి బాల శంకర్ కృష్ణ కొనియాడారు.గురువారం భారతరత్న, రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 131వ జయంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్ పట్టణం లోని డా బి ఆర్ అంబేద్కర్ కూడలి లోని స్థానిక బస్టాండ్ ప్రాంతం వద్ద బి ఆర్ అంబేద్కర్ నిలువెత్తు ప్రతిమకు ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ జిల్లా అదనపు కలెక్టర్ పాష సంయుక్త పాలనాధికారి నటరాజన్ తో కలిసి మాజీమంత్రి శాసనసభ్యులు జోగు రామన్న తో కలిసి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 131 జయంతి వేడుకలు ఘనంగా జరిపారు అనంతరం పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర అధికార ప్రజా ప్రతినిధులు వివిద దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ…
అణగారిన వర్గాల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం జీవితాంతం పరితపించిన మహనీయుడు అంబేద్కర్ అని చెప్పారు.
బడుగు, బలహీన వర్గాల హక్కులకు పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చి వారికి ఖచ్చితమైన భరోసాని, భవిష్యత్తుని ఇచ్చేలా రాజ్యాంగాన్ని రూపొందించిన దార్శనికుడు భారతరత్న విష మేధావి కాసేపు కాంతి సూర్యుడు అని అభివర్ణించారు బాబాసాహెబ్ అంబేద్కర్ అని కలెక్టర్ సీఖ్త నాయక్ ఆదిలాబాద్ జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ ఉదయ్ కుమార్ తెలంగాణ సంఘం సంఘం ప్రధాన కార్యదర్శి బాల శంకర్ కృష్ణ మాజీ మంత్రివర్యులు జోగు రామన్న పేర్కొన్నారు.
వారి జయంతి వేడుకల్లో పాల్గొనడం తన అదృష్టమని కలెక్టర్ అన్నారు.
కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మనోహర్, జిల్లా వ్యవసాయ సహకార సంఘ బ్యాంకు అధ్యక్షులు వడ్డే భోజ్ రెడ్డి జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి ఎస్సీ కార్పొరేషన్ ఈడీ పీడీ సునీత శంకర్ వివిద దళిత సంఘాల నాయకులు మోచి సంఘం కులస్తులు బాల శంకర్ కృష్ణ పాల్గొన్నారు
