దౌల్తాబాద్ మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షునిగా పరిధిలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు పడాల రాములు నియామకమయ్యారు. ఈ మేరకు టిపిసిసి సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్. మల్లు రవి ఆదేశాలు జారీ చేశారు. తనపై నమ్మకంతో మండల అధ్యక్షుడిగా నియమించినందుకు దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి నయవంచన లేకుండా చేస్తానని అన్నారు.
