ముస్తాబాద్, ప్రతినిధి జూలై 3 మండల కేంద్రంలో ఎఎమ్మార్ గార్డెన్ హాల్‌లో సోమవారం రోజున రెడ్ల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డి సంఘాల సభ్యులు ఒకే చోటచేరి విలేకరుల సమావేశంలో పలు సమస్యలు గురించి మాట్లాడారు. రెడ్డి సామాజిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈసమ్మేళనం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 2018లో బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని సీఎం కేసీఆర్ స్వయంగా ప్రకటించారని అన్నారు. అప్పటి నుంచి రెడ్డి కార్పొరేషన్‌ను సాధించుకునేందు కోసం రెడ్డి జేఏసీ ఆధ్వర్యంలో సభలు, సమావేశాలు, పాదయాత్రలు, ఛలో అసెంబ్లీ వంటి అనేక పోరాటాలు చేశామని అన్నారు. ఇప్పటి వరకు చట్టబద్ధతతో కూడిన రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయలేదని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంఘం నాయకులు కార్యకర్తలు సభ్యులు పాల్గొన్నారు.
